ట్యాపింగ్ నాయుడు…ఇంతకీ ఎవరాయన…?

ఏపీలో ట్యాపింగ్ నాయుడు ఉన్నారా. ఉంటే ఎవరాయన. ఈ పేరు మాత్రం తమాషాగా ఉంది. సెటైర్లు పంచులు పేల్చే వైసీపీ ఫైర్ బ్రాండ్, యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏకంగా…

ఏపీలో ట్యాపింగ్ నాయుడు ఉన్నారా. ఉంటే ఎవరాయన. ఈ పేరు మాత్రం తమాషాగా ఉంది. సెటైర్లు పంచులు పేల్చే వైసీపీ ఫైర్ బ్రాండ్, యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏకంగా ట్యాపింగ్ నాయుడు అని పేరు పెట్టేశారు.

పెగాసస్ స్పై వేర్ ని కొనుగోలు చేశారని బాబు మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు చేసిన నేపధ్యంలో గుడివాడ బాబు మీద ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. ఇది చాలా పెద్ద నేరం, దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఇలాంటి విషయాలలో కేంద్రం కూడా సరైన దర్యాప్తు జరిపించి వెనక ఎవరు ఉన్నారు అన్నది వెలికి తీయాలని గుడివాడ డిమాండ్ చేశారు.

ఇక పెగాసస్ స్పై వేర్ ని కొన్నట్లుగా చంద్రబాబు మీద ఆరోపణలు ఉంటే ఆయన ఇంతవరకూ దాన్ని ఖండించకపోవడమేంటి అని నిలదీశారు. పైగా ఈ ఆరోపణలను పక్కదోవ పట్టించేలా నాటు సారా ఉద్యమమని తమ్ముళ్ళను రోడ్ల మీదకు బాబు పంపించి ఆందోళనలు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఏపీలో ఎవరెవరి సంభాషణలు వినడానికి చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్ వేర్ కొన్నారో లోకానికి తెలియాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఇతరుల ఫోన్ సంభాషణలు వినడం నేరమని ఆయన అన్నారు. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ పనులు చేస్తూ చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడుగా మారిపోయారని సెటైర్లు వేశారు.

ఇక పెగాసస్ టెక్నాలజీ ద్వారా కేవలం ఫోన్ సంభాషణలు వినడమే కాదు, అనేక రహస్యాలు కూడా తెలుసుకునే అవకాశం ఉందని గుడివాడ అన్నారు. ఇది పెద్ద నేరమని, ఇందులో చంద్రబాబు పాత్ర ఎంతవరకూ ఉంది అన్న దాని మీద కేంద్రం విచారణ జరిపిస్తే అన్నీ వెలుగులోకి వస్తాయని గుడివాడ అన్నారు.

అదే విధంగా గతంలో ఓటుకు నోటు కేసు వేళ సెక్షన్ 8 గురించి మాట్లాడిన చంద్రబాబు ఇపుడు కనీసం రియాక్ట్ కాకపోవడమేంటి అని గుడివాడ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం సీనియర్ నేత, పైగా బాబుకు మిత్రురాలే. మరి ఆమె చెప్పిన మాట తప్పు అని అనుకుంటున్నారా అని గుడివాడ ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే గుడివాడ ఒక్క లెక్కన తన మాటలతోనే టీడీపీని, బాబుని చెడుగుడు ఆడేశారు.