ఉత్తరాంధ్రా జిల్లాలలో బిగ్ షాట్, టీడీపీకి చంద్రబాబు తరువాత ఉత్తరాధికారిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు ఇప్పటికి ఆరుసార్లు పోటీ చేస్తే అయిదు సార్లు గెలిచారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వరసగా రెండవసారి జెండా ఎగరేసిన అచ్చెన్నకు 2024లో హ్యాట్రిక్ కొట్టడం చాలా ముఖ్యం. అయితే అచ్చెన్న మూడవసారి గెలవడకుండా ఆయన పొలిటికల్ మూడ్ మొత్తం చేంజ్ చేస్తానని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏకంగా శపధమే చేస్తున్నారు.
ఎమ్మెల్సీయే తనకు ఒక గౌరవమని. జగనన్న తనను నమ్మి ఆ వరం ఇచ్చారని కూడా దువ్వాడ అంటున్నారు. తాను ఇక ఏ సంబరాలు జరుపుకున్నా సంతోషాలు చేసుకున్నా కూడా అవన్నీ 2024 ఎన్నికల తరువాతనే అంటున్నారు. అచ్చెన్నను టెక్కలిలో ఓడించి జగన్ కి బహుమతి ఇస్తానని కూడా దువ్వాడ అంటున్నారు.
ఇక శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్న రాజకీయానికి బ్రేకులు వేసే రోజులు దగ్గరపడ్డాయని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి దూకుడు రాజకీయాలు చేయడంలో ఫస్ట్ గా చెప్పుకునే దువ్వాడ రెండు దశాబ్దలా రాజకీయ జీవితం అంతా పోరాటాలతోనే గడిచింది.
ఆయన పట్టుదలను కూడా అంతా మెచ్చుకుంటారు. ఇపుడు ఆయన చేసిన శపధం ఆశామాషీదేమీ కాదని కూడా అంటున్నారు. సో అచ్చెన్నాయుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కూడా ఓటమి చెంతనే ఉంటుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి.