రాజధానిలో పర్యటనకు అంటూ ఇటీవలే ఆ ప్రాంతంలో పర్యటించారు సుజనా చౌదరి. అప్పుడు ఆయనకు అక్కడ వెల్కమ్ చెప్పింది, ఆయనతో పాటు కాషాయకండువాలు వేసుకుని తిరిగినది తెలుగుదేశం పార్టీ వారే! ఇక అదే ప్రాంత పర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్ వెంటా తెలుగుదేశం పార్టీ క్యాడరే కనిపించడం గమనార్హం. సుజనా చౌదరి వచ్చినప్పుడు కాషాయ కండువాలు వేసుకున్న వాళ్లే, పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ టవాళ్లు వేసుకుని తిరిగారని సమాచారం అందుతోంది.
తెలుగుదేశం పార్టీ లో వివిధ హోదాల్లో ఉన్న నేతలే జనసేన క్యాడర్ గా, పవన్ కల్యాణ్ అభిమానులుగా రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటనలో కనిపించడం గమనార్హం. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రాజధాని విషయంలో స్పందించడమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అభీష్టం మేరకే అనే టాక్ ముందు నుంచి ఉంది. లింగమనేని మేలుకోరి పవన్ కల్యాణ్ పర్యటన చేపట్టారని, అలా చంద్రబాబు అజెండా మేరకే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వెంట తెలుగుదేశం పార్టీ క్యాడర్ నేతలు ఉండటంతో పెద్ద విడ్డూరం లేదనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ సాదాసీదా క్యాడర్ తో పాటు ఆ పార్టీ ద్వారా పదవులు అనుభవించిన వారు, ఆ పార్టీలోనే వివిధ హోదాల్లో ఉన్న వారు జనసేన అధినేతకు జై కొట్టారట!