ఈమధ్యకాలంలో ఇంత నీచమైన ఆరోపణ ఇంకోటి లేదు

డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ తిరుమల వెళ్లారంటూ నానా యాగీ చేసిన తెలుగుదేశం పార్టీ చివరకు జనం చేత చీవాట్లు తిన్నది. అత్యుత్సాహంతో వేసిన కేసుపై కోర్టు మొట్టికాయలు కూడా వేసింది. అయినా కూడా టీడీపీ…

డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ తిరుమల వెళ్లారంటూ నానా యాగీ చేసిన తెలుగుదేశం పార్టీ చివరకు జనం చేత చీవాట్లు తిన్నది. అత్యుత్సాహంతో వేసిన కేసుపై కోర్టు మొట్టికాయలు కూడా వేసింది. అయినా కూడా టీడీపీ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు దుర్గగుడి అంశాన్ని తెరపైకి తెచ్చి రాష్ట్రంలో అరాచకం జరిగిపోతోందని, అరిష్టం జరిగిందని తన అక్కసు వెళ్లగక్కుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి, కొండలు ఉన్న ప్రాంతాల్లో వర్షపాతానికి రాళ్లు కిందపడటం సర్వ సాధారణం. అందులోనూ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై నుంచి తరచూ కొండచరియలు కిందపడుతుంటాయి. అయితే దీన్ని ఓ అరిష్టంగా చెబుతూ ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఓ ట్వీట్ వేసింది.

“సీఎం జగన్ రాక మునుపు ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండ చరియలు, ఇది అరిష్టం కాకపోతే మరేమిటి? అమ్మవారి వెండి సింహాలు ఏమయ్యాయి?” ఇదీ ఆ ట్వీట్ సారాంశం. వర్షాలకు కొండ చరియలు విరిగి పడితే, సీఎం రాకతో దానికి ఏం సంబంధం ఉన్నట్టు? పోనీ కొండ చరియలు విరిగి పడటాన్నే అరిష్టంగా భావిస్తే.. టీడీపీ హయాంలో ఎన్నిసార్లు ఈ అరిష్టం జరిగిందో లెక్కతీస్తారా.

అసలు టీడీపీ హయాంలోనే అమ్మవారి రథానికి ఉన్న వెండి సింహాలు మాయం అయినట్టు ఆరోపణలున్నాయి. వాటిపై ఆ పార్టీ నేతలు ఏమంటారు? ఆరోపణలు చేయడానికి మరీ ఇంచ నీఛానికి దిజారాలా అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.

అరిష్టం అంటూ లెక్కలు తీస్తే.. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే పెద్ద అరిష్టం అని చెప్పుకోవాలి. అందుకే గత ఐదేళ్లలో ఏపీ అభివృద్ధిలో వెనకపడిపోయింది. ఆ అరిష్టాన్నంతా పోగొట్టి కేవలం ఏడాది పాలనలోనే జనాన్ని మెప్పించారు జగన్. అభివృద్ధి విషయంలో విమర్శలు చేయడం కుదరక, ఇలా మతపరమైన విషయాలను తీసుకొచ్చి నానా యాగీ చేస్తున్నారు.

తిరుమల డిక్లరేషన్ విషయంలో తలబొప్పి కట్టినా.. ఇప్పుడు దుర్గగుడికి సీఎం హోదాలో జగన్ వెళ్లడాన్ని మరోసారి తప్పుపడుతోంది టీడీపీ బ్యాచ్. బహుశా ఈ ఏడాది కాలంలోఇంత నీచమైన ఆరోపణ ఇంకోటి రాలేదేమో.

బీజేపీ కోసం పవన్ అంత ధైర్యం చేస్తారా?