తమదే పైచేయి అంటున్న తమ్ముళ్ళు … ?

తెలుగుదేశం వ్యూహాలే అలా ఉంటాయని అనుకోవాలేమో. లేకపోతే జరుగున్న పరిణామాలను చూసి కూడా ఇంకా మాదే పై చేయి అని ఎవరైనా అంటారా. టీడీపీ పెద్దల తీరు మాత్రం అలాగే ఉందిట మరి.  Advertisement…

తెలుగుదేశం వ్యూహాలే అలా ఉంటాయని అనుకోవాలేమో. లేకపోతే జరుగున్న పరిణామాలను చూసి కూడా ఇంకా మాదే పై చేయి అని ఎవరైనా అంటారా. టీడీపీ పెద్దల తీరు మాత్రం అలాగే ఉందిట మరి. 

విశాఖ టీడీపీకి కంచుకోట. ఆ విషయం నిన్నటి మాట. అవును ఇది నిజమే మరి. విశాఖలో ఇపుడు ఎటు చూసినా పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకూ అంతటా వైసీపీ వారే కనిపిస్తున్నారు.

అయితే తాజాగా విశాఖ కార్పోరేటర్లు, ఇతర సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో మాత్రం విశాఖలో వైసీపీకి అనుకూలతే లేదని పార్టీ పెద్దలు వ్యాఖ్యానించారని టాక్. ఏకంగా చంద్రబాబే విశాఖలో టీడీపీకి తిరుగులేదు అని చెప్పుకొచ్చారుట మరి. 

కంచుకోట అయినా విశాఖ జిల్లాలో టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని కూడా ఆయన  విశ్వాస్వం వ్యక్తం చేశారుట. విశాఖలో పార్టీకి మంచి రోజులు మళ్ళీ తప్పకుండా వస్తాయని కూడా బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఒక పార్టీగా నేతలు ఆశ పడడంతో తప్పులేదు కానీ విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో అరవై శాతం సీట్లు సాధించి మేయర్ సీటుని కైవశం చేసుకున్న వైసీపీకి జనాదరణ లేదు అనడం అంటే నిజంగా ఆత్మ వంచన చేసుకోవడమే అంటున్నారు. 

ఆత్మ స్తుతి పరనిందలతో ఒరిగేది ఏమీ ఉండదని కూడా తేల్చేస్తున్నారు. మరి టీడీపీ ఇప్పటికీ విశాఖను కంచుకోటే అనుకుంటే మాత్రం చేయాల్సింది చాలానే ఉందని కూడా పార్టీ తరఫున  సూచనలు వస్తున్నాయి.