రాజకీయం చేయడమే ముఖ్యం. అందులో కులాలు, మతాలు, ప్రాంతాలు ఎవైనా సరే కలిపేసి పులిహోర చేసేయడమే టీడీపీ స్పెషాలిటీ. ఇందుకు విశాఖలో దళిత యువకుడి శిరోముండనం కేసు ఒక ఉదాహరణ.
నిజానికి ఈ కేసులో బిగ్ బాస్ ఫేం నూతననాయుడు బ్యార్య అరెస్ట్ అయ్యారు. మరింతమంది కూడా కటకటాల వెనక్కు వెళ్లారు. అయితే ఈ కేసులో నూతన్ నాయుడు ఒకపుడు వైసీపీలో తానున్నాను అంటూ అప్పట్లో యూ ట్యూబ్ లో వీడియోలను ఆసరాగా తీసుకుని బురద జల్లాలని పచ్చ పార్టీ చేసిన ప్రయత్నాలను వైసీపీ విజయవంతంగానే తిప్పికొట్టింది.
నిజానికి నూతన్ నాయుడుది ఒక పార్టీ కాదు, ఒక యవ్వారం కాదు, ఆయన జై సమైక్యాంధ్రా పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ పార్టీ తరువాత లగడపాటి రాజగోపాల్ తో కలసి 2019 ఎన్నికల నుందు టీడీపీ గెలుస్తుందంటూ చేసిన ఒక సర్వేలో భాగస్వామి అని కూడా చెబుతారు.
ఇక ఆయన ఈ మధ్య అంతా జనసేనాని పవన్ కళ్యాణ్ వీరభిమానిగా ఉన్నారు. ఆర్జీవీని కౌంటర్ చేస్తూ పరాన్నజీవి సినిమా కూడా తీశారు. ఇవన్నీ పక్కనపెట్టేసి ఎపుడో ఆయన పెట్టిన యూ ట్యూబ్ వీడియోను పట్టుకుని వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ నానా పాట్లు పడింది.
కానీ వెంటనే మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించి బాధితుడి దగ్గరకు వెళ్లి పరామర్శ చేసి ఆర్ధిక సాయంతో పాటు ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇవ్వడంతో ఈ కధ సుఖాతం అయింది. ఇక్కటో ట్విస్ట్ ఏంటి అంటే బాధితున్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఫోన్లో పరామర్శించి అండగా ఉంటామని చెప్పడం. మరి ప్రభుత్వం ఓ వైపు ఆదుకుంటున్నా కూడా రాజకీయాలు చేయడానికి టీడీపీ ఎంతలా పాకులాడుతోందో చెప్పేందుకు బాబు ఫోన్ కాల్ ఒక ఉదాహరణ అంటున్నారు.
దీని మీదనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ వీధి గొడవలు, వ్యక్తిగత వివాదాల్లో కూడా వైసీపీని ఇరికించి బురద జల్లాలని చూడడం బాబుకే చెల్లిందని విమర్శించారు. దళితులకు అధికారంలో ఉన్నపుడు ఏ న్యాయం చేయని బాబు ఇపుడు ఉత్తిత్తి ప్రేమలు చూపిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఘాటుగానే తగులుకున్నారు. కులం కంపు లేని ఉత్తరాంధ్రలో ఈ తరహా రాజకీయాలు చేయకండి బాబూ అంటూ ఆయన గట్టిగానే అటాక్ చేశారు.