వి తో సినిమా ప్రమోషన్లలో మార్పు?

తొలిసారి ఓ భారీ సినిమా టాలీవుడ్ నుంచి నేరుగా అమెజాన్ ప్రయిమ్ లో విడుదలవుతోంది. దిల్ రాజు నిర్మించిన వి సినిమా ను ఈ నెల అయిదున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మామూలుగా అయితే…

తొలిసారి ఓ భారీ సినిమా టాలీవుడ్ నుంచి నేరుగా అమెజాన్ ప్రయిమ్ లో విడుదలవుతోంది. దిల్ రాజు నిర్మించిన వి సినిమా ను ఈ నెల అయిదున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మామూలుగా అయితే తెలుగు సినిమాల ప్రమోషన్ స్కీముల ప్రోటోకాల్ వేరు. అలాగే ఇప్పటి వరకు సినిమాలను థియేటర్ లో విడుదల చేసిన తరువాత ఓటిటికి ఇచ్చారు అందువల్ల సినిమా ప్రచారంలో ఓటిటిలకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమా ప్రచారం అంతా ఓటిటి ప్లానింగ్ నే.

అదృష్టం ఏమిటంటే మార్చి నుంచి సరైన సినిమా అటు థియేటర్ లో కానీ ఇటు ఓటిటిలో కానీ రాకపోవడం. ఓటిటి లో తొలిసారి వస్తున్న పెద్ద సినిమా. అందువల్ల తెలుగు ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను స్వాగతించడానికి సిద్దంగా వున్నారు. పైగా అమెజాన్ ప్రయిమ్ కు భారీ సంఖ్యలో సబ్ స్క్రయిబర్లు వున్నారు. పైగా ఓటిటి దారిలోకి తెలుగు సినిమాలు నేరుగా వెళ్లే లైన్ లో తొలి సినిమా కావడంతో మంచి సంఖ్యలో కొత్త సబ్ స్కబ్ స్క్రయిబర్లు నమోదయ్యే అవకాశం వుంది. కానీ దీని తరువాత వచ్చే సినిమాలకు ఈ అవకాశం వుండకపోవచ్చు.

ఇదంతా ఇలా వుంటే సినిమాకు ప్రచారం విషయంలో అమెజాన్ అస్సలు ప్రీ హ్యాండ్ ఇవ్వలేదని టాలీవుడ్ లో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. నాని తొలిసారి ఓ ట్వీట్ వేసినపుడే ఓటిటి సంస్థ ప్రతినిధుల నుంచి అభ్యంతరం వచ్చినట్లు తెలుస్తోంది. తమకు చెప్పకుండా ఎందుకు వేసారు అనే టైపు ప్రశ్నలు ఎదురయినట్లు తెలుస్తోంది. దీంతో నాని చాలా వరకు సైలంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో మాదిరిగా డిఫరెంట్ గా పబ్లిసిటీ ప్లాన్ చేసారు. 

ట్రయిలర్ ను వదిలే విషయంలోనే ఆ ప్లానింగ్ కు తెలుగు ఆడియన్స్ కాస్త చిరాకు పడ్డారు. ట్విట్టర్ లో ట్రోల్ చేసారు. ఆ తరువాత ఓటిటి సంస్థ చిన్న చిన్న కాన్సెప్ట్ లు ముందుగా ఆలోచించినా, తరువాత మళ్లీ అవి డ్రాప్ అయినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఈలోగా నాని ఫ్లాట్ కు సమీపంలో కోవిడ్ కేసు వచ్చిందని, దాంతో ఆయన తనంతట తాను బయటకు రాకుండా లోపల వుండిపోయారని తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఇప్పటికి డైరక్టర్, ఒక హీరో ప్రెస్ మీట్ లతో ప్రచారం సగం పూర్తయిపోయింది. ఇక నాని, సుధీర్ బాబుల ప్రెస్ మీట్ లు వున్నాయి అలాగే నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ . ఇవన్నీ కూడా జూమ్ లోనే. 

మొత్తం మీద ఓటిటితో ఓ అడ్వాంటేజ్ ఏమిటంటే, ప్రమోషన్ టెన్షన్, హడావుడి, ఖర్చు చాలా వరకు తగ్గినట్లే. ఇప్పటి వరకు టీవీ కమర్షియల్స్ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈ స్కీము వర్కవుట్ అయితే కరోనా తరువాత కూడా సినిమా పబ్లిసిటీ వ్యవహారంలో కాస్త చెప్పుకోతగ్గ మార్పులు చోటు చేసుకుంటాయేమో?

V కథను పవన్-మహేష్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేదు