వర్ల రామయ్య ఇంకా ఆ పదవిలోనే!

తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితం అయిన నామినేటెడ్ పదవుల్లోని వారు, ఇంకా కన్సల్టెంట్లు యథేచ్ఛగా కొనసాగుతూ ఉండటం విస్మయకరంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించినా నాడు నియమితం అయిన తెలుగుదేశం నేతలు మాత్రం…

తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితం అయిన నామినేటెడ్ పదవుల్లోని వారు, ఇంకా కన్సల్టెంట్లు యథేచ్ఛగా కొనసాగుతూ ఉండటం విస్మయకరంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించినా నాడు నియమితం అయిన తెలుగుదేశం నేతలు మాత్రం ఇంకా పదవుల్లో కొనసాగుతూ ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే వీళ్లలో కొందరు తమకు ఫండ్స్ కావాలంటూ కొత్త ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపుతున్నారట. తమ అధికారాలను యథేచ్చగా అమలు చేస్తున్నారట.

వీరిలో వీర టీడీపీ భక్తుడు వర్లరామయ్య కూడా ఉండటం గమనార్హం. చంద్రబాబుకు వీర విధేయుడు అయిన ఈయనకు అప్పట్లో ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరస్కరించబడినా వర్ల రామయ్య మాత్రం ఇంకా తన పదవిని వదలడంలేదట! జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడటానికే ఉండే ఈయన అదే ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా కొనసాగుతూ ఉండటం గమనార్హం.

టీడీపీవాళ్లు మర్యాదగా తప్పుకోవాలని, గౌరవంగా తప్పుకోవాలని ప్రభుత్వం నుంచి సూచనలు వస్తున్నా వర్ల వంటి వాళ్లు పదవులను వదులుకోవడం లేదని తెలుస్తోంది. తొలగించేంత వరకూ వీరు ఆ పదవులను వదిలే రకంగా కనిపించడం లేదు. ఇక వీళ్లు మాత్రమే కాదట.. చంద్రబాబు హయాంలో భారీ వేతనాలకు అంటూ నియమితం అయిన కన్సల్టెంట్ల కథ కూడా అలానే ఉందట. మున్సిపల్ శాఖలో, అమరావతి విషయంలో బోలెడంత మంది కన్సల్టెంట్ల హోదాలతో నియమితం అయ్యారు. వారికి లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారట. అంతేకాగా అభివృద్ధి నిధులు కావాలంటూ వాళ్లు ఇప్పుడు నిస్సిగ్గుగా కొత్త ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇస్తున్నారట!

కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండునెలలు అయిపోయినా ఇలాంటివాళ్లు ఇంకా తమ పదవులను పట్టుకుని వేలాడుతూ ఉండటం గమనార్హం. వీరికి సాధారణ పరిపాలన శాఖ నుంచి మరో వార్నింగ్ కూడా వచ్చిందట. పదవులు వదులుకోవాలని గౌరవంగా తప్పుకోవాలని సూచిస్తున్నారట. అయినా తెలుగుదేశం వాళ్లు మాత్రం తమ దోపిడీని కొనసాగిస్తూ ఉన్నట్టు భోగట్టా. వీరందరి తొలగింపునూ శాసనసభ ద్వారా చేపట్టాలనే సూచనలు జగన్ ప్రభుత్వానికి అందుతున్నాయి. 

డియర్ కామ్రేడ్ నా మూడేళ్ళ కష్టం.. భరత్ స్పెషల్ చిట్ చాట్

‘అర్జున్ రెడ్డి’ లెగసీ ఇంకా.. ఇంకా..!