క్రికెటర్ బూమ్రాకు, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు మధ్య ఏదో నడుస్తుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అనుపమను బూమ్రా ఫాలో అవ్వడంతో పాటు.. ఆమధ్య హోటల్ లో వీళ్లిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలు కూడా బయటకొచ్చాయి. తమ మధ్య అలాంటిదేం లేదంటూ గతంలో ఓసారి ఖండించిన ఈ బ్యూటీ, తాజాగా మాత్రం బూమ్రాతో ఎఫైర్ పై రియాక్ట్ అవ్వడానికి నిరాకరించింది. కనీసం అతడి పేరును కూడా పలకలేదు.
రాక్షసుడు సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకొస్తోంది అనుపమ పరమేశ్వరన్. ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూకు ఇచ్చింది. ఈ సందర్భంగా మరోసారి బూమ్రా వ్యవహారాన్ని ప్రస్తావించారు మీడియా ప్రతినిథులు. దీంతో కాస్త అసహనంగా మొహం పెట్టింది అనుపమ. నో కామెంట్ అని మాత్రమే స్పందించింది.
మీడియా ప్రతినిధులు మాత్రం తగ్గలేదు. గతంలో బూమ్రాను కేవలం స్నేహితుడు అని మాత్రమే అన్నారని, ఇప్పుడు కూడా స్నేహితుడేనా లేక అంతకంటే కాస్త ఎక్కువా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా అనుపమ సైలెంట్ గానే ఉండిపోయింది. ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండని మీడియా అడగ్గా.. నో కామెంట్ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. కేవలం సినిమా గురించి మాత్రమే అడగమని కోరింది.
అనుపమ ఫేస్ ఫీలింగ్స్ చూసిన తర్వాత మరిన్ని అనుమానాలు రేకెత్తాయి. ఆమెకు బూమ్రాకు మధ్య కనెక్షన్ కట్ అయిందంటూ కొత్త పుకార్లు ఊపందుకున్నాయి. అది నిజమే అంటోంది అనుపమ క్లోజ్ సర్కిల్. మరోవైపు తెలుగులో అనుపమకు సినిమా అవకాశాలు కూడా తగ్గడంతో ఆమె మరోసారి మలయాళ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తోంది.