ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టిడిపి

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తన్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. Advertisement వంశీ ముఖ్యమంత్రి జగన్ ను కలవడమే కాకుండా, ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపిన సంగతి తెలిసిందే. అదే…

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తన్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.

వంశీ ముఖ్యమంత్రి జగన్ ను కలవడమే కాకుండా, ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో చంద్రబాబు ప్రతిపక్ష నేత గా విఫలం అవుతున్నారని, చంద్రబాబు చేసిన ఇసుక దీక్షను కూడా వంశీ తప్పు పట్టారు.

కాగా వంశీ తాను టిడిపికి రాజీనామా చేస్తున్నానని పది రోజుల కిందటే ప్రకటించారు. అప్పట్లో ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నం చేశారు. అది విఫలం అయింది.