రాష్ట్ర రాజధాని అనేది దాని బౌండరీల్లో ఎక్కడైనా ఉండొచ్చు.. అని కేంద్రం స్పష్టత ఇచ్చింది. మూడు రాజధానులు, ఒకే రాజధానా.. అనేది పాయింటే కాదు అని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఆ రాజధాని ఎక్కడ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొంది. మొదటి నుంచి నిపుణులు ఇలాగే చెబుతూ వచ్చారు. రాజ్యాంగం ప్రకారం.. రాజధానికి కేంద్రం ఆమోదముద్ర అవసరం లేదని అన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ఏదీ ముద్ర కొట్టించుకోలేదని గుర్తు చేశారు. అయినా వితాండవాదం, అహంకారం ఎక్కువ స్థాయిలో ఉండిన పచ్చదళం అందుకు ఒప్పుకోలేదు.
అదిగో కేంద్రం అపుతుంది, ఇదిగో కేంద్రం ఆపేస్తుంది.. ఎవరికి చెప్పాలో వారికి చెప్పారు.. మోడీ, అమిత్ షాలు గుర్రుగా ఉన్నారు.. అంటూ ప్రచారం చేశారు. చేతిలో మీడియా ఉంది కదా.. చెప్పిందే చెప్పారు. చివరకు ఝలక్ తగలనే తగిలింది.
అయితే ఇలా కిందపడ్డా తమదే పై చేయి అని పచ్చదళం మురిసిపోతూ ఉంది. అదేమంటే.. ఏపీకి అమరావతిని రాజధానిగా కేంద్రం గుర్తించిందట. 2015లోనే అది జరిగిందని ఇప్పుడు కేంద్రం చెప్పిందట. ఇదీ పచ్చదళం పిచ్చి ఆనందం! అమరావతిని రాజధానిగా నోటిఫై చేసినట్టుగా కేంద్రం ప్రకటించిందని తెలుగుదేశం వాళ్లు మురిసిపోతూ ఉన్నారు. ఇలా తాము పై చేయి సాధించినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు.
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయలేదని అన్నారని, జీవో ఇవ్వలేదన్నారని, ఇప్పుడు అదంతా అబద్ధమని తేలిందని టీడీపీ వాళ్లు, టీడీపీ అనుకూల మీడియా తెగ మురసిపోతూ ఉన్నారు. కేంద్రం లోక్ సభలో ఇచ్చిన సమాధానంలో.. పై రెండు లైన్లూ తమకు అనుకూలంగా ఉండే సరికి వాటిని మాత్రమే వాస్తవం అన్నట్టుగా భ్రమింపజేయడానికి టీడీపీ దళం ప్రయత్నిస్తూ ఉంది. అదే పేరాలో కింది లైన్లలో.. తెలుగుదేశానికి షాక్ కొట్టే సమాచారం ఉంది. అప్పుడు అమరావతిని నోటిఫై చేసినట్టుగానే, ఇప్పుడు మూడు రాజధానులను ఏపీ ప్రభుత్వం నోటిఫై చేయవచ్చు అన్నట్టుగా ఉంటుంది కింది పేరా. దాన్ని దాచేస్తూ.. ఇప్పుడు హడావుడి చేస్తూ యథావిధి కామెడీ చేస్తోంది!