ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతికి ఆ హక్కులేదా..?

రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు పడగొడుతున్నారని గొడవ మొదలు పెట్టింది టీడీపీ. అవసరం ఉన్న చోట విగ్రహాలను పక్కకు మారుస్తున్నామే కానీ వాటిల్ని పడగొట్టాలనే ఉద్దేశం లేదని అంటోంది వైసీపీ. ఎవరి వాదనలు ఎలా ఉన్నా..…

రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు పడగొడుతున్నారని గొడవ మొదలు పెట్టింది టీడీపీ. అవసరం ఉన్న చోట విగ్రహాలను పక్కకు మారుస్తున్నామే కానీ వాటిల్ని పడగొట్టాలనే ఉద్దేశం లేదని అంటోంది వైసీపీ. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అయితే ఎన్టీఆర్ అభిమానుల్ని శాంతింపజేసేందుకు స్థానిక వైసీపీ నేతలు ఆయన భార్య లక్ష్మీపార్వతిని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారు.

ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని మరో చోటుకు మార్చి అక్కడ నెలకొల్పే కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని పిలుస్తామని చెప్పారు. దీంతో టీడీపీ నాయకులకు మరింత మండింది. అసలు లక్ష్మీపార్వతి ఎవరు? ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు ఆమెను ఎందుకు పిలుస్తారు? ఎన్టీఆర్ విగ్రహం మాది, ఆగ్రహం కూడా మాదేనంటూ రెచ్చిపోతున్నారు. అయితే వైసీపీ మాత్రం వీరిని మరింతగా రెచ్చగొడుతోంది. ఎన్టీఆర్ విగ్రహ పునఃప్రతిష్టకు లక్ష్మీపార్వతే చీఫ్ గెస్ట్ అంటున్నారు నాయకులు.

వెన్నుపోటు తర్వాత చంద్రబాబు పార్టీని లాక్కున్నారు కానీ, మామని అలానే వదిలేశారు కదా. పోనీ ఆయనంటే అల్లుడు, కనీసం అంతమంది సంతానంలో ఏ ఒక్క కొడుకూ కూతురు కానీ అవసాన దశలో ఆయనతో పాటు లేరు. అంతమంది బంధుగణం ఉన్నా, రాష్ట్రవ్యాప్తంగా పేరున్నా.. చివరకు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ఒడిలోనే కన్నుమూశారు. చివరి దశలో ఆయనకు వెన్నంటి ఉండి సేవ చేసిన లక్ష్మీపార్వతి కంటే ఇంకెవరికి ఆ అధికారం ఉంటుంది.

కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా.. వైసీపీ లేవదీసిన చర్చ మాత్రం స్థానికంగా టీడీపీ నేతల్ని ఆలోచనలో పడేసింది. ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతికి ఆ మాత్రం హక్కు లేదా అని టీడీపీ కార్యకర్తలే సింపతీ చూపించడం విశేషం.

ఒకవేళ వైసీపీ నిజంగానే లక్ష్మీపార్వతిని ఆహ్వానిస్తే మాత్రం అది సంచలనమే అవుతుంది. ఎన్టీఆర్ కి అసలైన వారసులెవరనే విషయం మరోసారి చర్చకు వస్తుంది, వెన్నుపోటు వీరుడు చంద్రబాబు, తండ్రికి అవమానం జరిగినా తమాషా చూసిన ఉత్తర కుమారుల వ్యవహారాలన్నీ మరోసారి బైటకొస్తాయి. అందుకే చంద్రబాబు కూడా ఈ వ్యవహారంలో తటపటాయిస్తున్నారు. లక్ష్మీపార్వతి రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని స్థానిక నాయకులకు సూచించారట. ఇప్పుడు టీడీపీ నేతల బాధ ఎన్టీఆర్ విగ్రహం గురించి కాదు, లక్ష్మీపార్వతి రాక గురించి. 

చిలుకూరు ఆల‌యంలో అద్భుతం