తెలంగాణలో ఈరోజు ఒకేసారి 25,132 మందిని సెల్ఫ్ క్వారంటైన్ నుంచి రిలీజ్ చేయబోతున్నారు. వీళ్లంతా విదేశాల నుంచి వచ్చినవాళ్లు. మార్చి 22-24 తేదీల మధ్య వీళ్లందర్నీ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచారు.
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 2 వారాల పాటు వీళ్లను స్వీయ నిర్భధంలో ఉంచారు. ఆ గడువు మంగళవారంతో పూర్తయింది. ఎందుకైనా మంచిదని మరో 2 రోజులు అదనంగా వీళ్లను ఇళ్లకే పరిమితం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఈరోజుతో వాళ్లను రిలీజ్ చేయబోతోంది.
కేవలం విదేశాల నుంచి వచ్చిన వాళ్లనే కాకుండా.. వాళ్లను కలిసిన వ్యక్తుల్ని కూడా ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. వీళ్లలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవు. ఈరోజు వీళ్ల ఇళ్లకు అతికించిన కరోనా అలెర్ట్ స్టిక్కర్లను తొలిగిస్తారు. ఇవాళ్టి నుంచి వీళ్ల ఇళ్లపై పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా ఉండదు. వీళ్లందరికీ ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు, శానిటైజర్లు కూడా అందించబోతున్నారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453గా ఉంది. ఇప్పటివరకు 11 మంది మరణించగా.. 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు సాయంత్రం లోపు మరో 230 మంది అనుమానిత రోగుల కరోనా టెస్ట్ రిజల్ట్ రాబోతోంది.