హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. అల్లావుద్దీన్ కోటి ఏరియాలో 8ఏళ్ల బాలుడు అబ్దుల్ వహీద్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నిన్న అమావాస్య కావడంతో అదే ప్రాంతంలో ఉంటున్న ఓ హిజ్రా నరబలి ఇచ్చినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ (8) గురువారం సాయంత్రం నమాజ్ చేయడానికి వెళ్లి తప్పిపోయాడు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులకు ఎక్కడ బాలుడి అచుకి లభించకపోవడంతో సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి 8.30 గంటలకు బకెట్‌లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీశారు.
కాగా ఒకవైపు హిజ్రా ఇంట్లో కనిపించిన క్షుద్రపూజల ఆనవాళ్లతో తనే బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా బస్తీవాసులు చెబుతున్నా. .మరోవైపు చిట్టీ డబ్బుల గొడవ కారణంగానే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.