కాంగ్రెస్ నేతలు మాటలతోనే రాజకీయం చేస్తున్నారు. ఎన్నికలల్లో గెలవడం కంటే సొంత పార్టీ వారిని ఎలా ఇబ్బందులు పెట్టాలో వారికి తెలిసినట్లు పక్క పార్టీ వారికి కూడా తెలియకపోవచ్చు. తాజాగా తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సొంత పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ తాను సోనియా గాంధీ ఏజెంట్ నని… ఇంకా ఎవరికి ఏజెంట్ కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఉద్దేశిస్తూ ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్‌లో చాలా మంది సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీకి నాయకులు కాదు.. పార్టీనే ముఖ్యం. టీపీసీసీ చీఫ్ కెప్టెన్ మాత్రమే. ఒక్క నాయకుడిపై కాంగ్రెస్ ఎప్పుడు ఆధారపడదని..టీమ్ వర్క్ ను మాత్రమే కాంగ్రెస్ నమ్ముతుందని తెలిపారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు ఉపఎన్నిక ఉంటుందని, రానున్న వంద రోజుల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోని వెళ్తామని ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తెలిపారు. బీజేపీలో చేరిన నేతలు తనపై, పార్టీపై అనవసర నిందలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నిక ఎప్పుడు వచ్చిన మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. అధిష్టానం ప్రియాంక గాంధీని ఇంచార్జ్ గా నియమిస్తే స్వాగతిస్తామని తెలిపారు. కోమటి రెడ్డి నాకు స్నేహితుడు అంటూ వారి ఇంటికి పిలిచి బోజనం పెట్టారని అన్నారు. వచ్చే రోజుల్లో గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం చేస్తామని తెలిపారు.