బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ ఆఫీసుకు మహిళను పిలిపించి విచారణ చేయడంపై దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా పరిష్కారించాలన్న కవిత అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 24వ తేదీనే విచారిస్తామని సృష్టం చేసింది.
మహిళగా తనకు ఉన్న హక్కులను, వ్యక్తిగత గోప్యతను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హరిస్తున్నదని నిన్నటి ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈ నెల 20న మరోసారి విచారణకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే కవిత పిటిషన్‌ను పక్కకు పెడుతూ.. ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని అందులో ఎలాంటి మార్పు లేదని సుప్రీం కోర్టు సృష్టం చేసింది.
అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్న కారణంతో ఈడీ విచారణకు హాజరుకాలేదు.. తాజా కోర్టు తీర్పు తర్వాత 20వ తేదిన ఈడీ ఆఫీసుకు వెళ్లి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో కవితకు మరో మార్గం లేకుండా పోయింది.