మళ్ళీ పుట్టిన పార్టీలోకేనట!

చాలామంది నాయకులు తాము పుట్టిన పార్టీని అంటే రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వదిలిపెడుతుంటారు. వేరే వేరే పార్టీల్లో చేరతారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ సీనియర్ సినిమా యాక్టర్…

చాలామంది నాయకులు తాము పుట్టిన పార్టీని అంటే రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వదిలిపెడుతుంటారు. వేరే వేరే పార్టీల్లో చేరతారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ సీనియర్ సినిమా యాక్టర్ అంటే కమెడియన్ కమ్ పొలిటీషియన్ రాజకీయంగా తనకు జన్మనిచ్చిన పార్టీలోకి మళ్ళీ వెళుతున్నాడనే ఊహాగానాలు వస్తున్నాయి.

ఆయన ఒకప్పుడు సినిమాల్లో చాలా బిజీ కమెడియన్. ఇప్పుడు పూర్తిగా వెండి తెరకు దూరమయ్యాడు. ఆయనే బాబూ మోహన్. ఆయన రాజకీయాల్లోకి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతోనే ప్రవేశించాడు. 1998 లోనే ఉప ఎన్నికలో గెలిచాడు. 1999 ఎన్నికల్లో గెలిచాడు

అప్పుడు సినిమాల్లో మంచి ఊపు మీద ఉన్నాడు. అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ హవా కూడా వీస్తోంది. కాబట్టి ఆందోల్ నుంచి సులభంగా గెలిచాడు. తరువాత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో మంత్రిగా చేశాడు.

కానీ కొన్ని కారణాలవల్ల కేసీఆర్ పార్టీలో చేరాడు. 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించాడు. కానీ 2018 లో కేసీఆర్ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. జర్నలిస్టు క్రాంతి కిరణ్ కు ఇచ్చాడు. దీంతో బీజేపీలో చేరి పోటీ చేశాడు. కానీ ఓడిపోయాడు. 2023 లోనూ ఓడిపోయాడు. తరువాత కేఏ పాల్ పెట్టిన ప్రజాశాంతి పార్టీలో చేరాడు.

పాల్ ఆయన్ని తెలంగాణకు పార్టీ అధ్యక్షుడిగా నియమించాడు. అసలు బాబూ మోహన్ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశాడో లేదో కూడా ఎవరికీ తెలియదు. అసలు ప్రజాశాంతి పార్టీలో ఉన్నాడో లేడో కూడా తెలియదు. చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసి ఏపీలో ఘన విజయం సాధించాడు కదా. దీంతో తెలంగాణలోనూ పార్టీకి మళ్ళీ ప్రాణం పోయాలనుకుంటున్నాడు.

పార్టీని మళ్ళీ ట్రాక్ మీద పెట్టాలనుకుంటున్నాడు. అందుకోసం సీరియస్ గానే పని చేస్తున్నట్లుగా కనబడుతోంది. అందుకే బాబూ మోహన్ చూపు పుట్టిన పార్టీ మీద పడింది. బాబు హైదరాబాద్ వస్తే వెళ్లి కలిశాడు. బాబును కలిశాడంటే ఏదో ప్లాన్ ఉంటుంది కదా. అందుకే టీడీపీలో చేరతాడనే ఊహాగానాలు సాగుతున్నాయి. మరి బాబు ఆలోచన ఏమిటో.

బాబూ మోహన్ కు గతంలో ఉన్నంత ప్రజాదరణ ఇప్పుడు లేదు. ఆరోగ్యం కూడా బాగాలేదని అంటున్నారు. ఒకవేళ పార్టీలో చేరినా యాక్టివ్ గా ఉంటాడని చెప్పలేం. తాను పొలిటికల్ గా షైన్ అవడానికి పుట్టిన పార్టీని ఉపయోగించుకుంటాడు. ఇప్పటికే చాలా పార్టీలు మారిన ఈ కమెడియన్ టీడీపీని కూడా వదిలిపెట్టడని నమ్మకం ఏమిటి?

7 Replies to “మళ్ళీ పుట్టిన పార్టీలోకేనట!”

    1. భలేవాడివి బాబు ఇలాంటివి మా G A లో రాస్తారా ఏంటి

      అనంత బాబు లాంటి ఎదవలు చేసే చిరాకు పనులు

      దువ్వాడ లాంటి దువ్వెన చేసే పనులు లాంటివి ఇక్కడ రాయరు నాయన

      కేవలం టిడిపిని తిట్టడానికి జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తటానికి పనికి వచ్చే రాతలే రాస్తారు

  1. వీడు వెళ్ళని పార్టీ ఉందా? చివరికి k a paul పార్టీలో కూడా చేరాడు. యూజ్లెస్ ఫెలో

  2. ఎందుకు ఉన్నాడు రా బాబు 11 గాడు

    రిషికొండ ప్యాలెస్ చూసుకుని ఏడ్వటానికా??

    పనికిమాలిన 11 .. ఈసారి లండన్ కి పారిపోతున్నాడు.

    బూమ్ బూమ్ Vజయ్ మాల్య తో పిల్ల పెళ్ళి చేస్తున్నాడట.. చాలా సీక్రెట్ గా

    ఏం చేస్తాం అంతా సజ్జల్ మాయ.. లేకపోతే ఈపాటికే ప్యాలెస్ బెడ్రూమ్ లో సముద్ర0 మీద ఎన్నెల చూస్తూ అడల్టరీ గేమ్ ఆడుతుండేవాళ్ళు..

    ఈ ఆంధ్ర జనాలు ఉన్నారే.. Leven mohana ni మోసం చేశారు

Comments are closed.