కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ యాత్ర ఇవాళ తెలంగాణలో ప్రవేశిస్తోంది. ఇవాళ ఉదయం కర్ణాటకలోని రాయచూర్ నుంచి మొదలైన యాత్ర తెలంగాణలో ప్రవేశించనుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం చెప్పడానికి భారీ ఏర్పాట్లు చేశారు.
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి మొదలైన భారత్ జోడో యాత్ర ఇప్పటికై తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను దాటి తెలంగాణలో ప్రవేశించనుంది. యాత్ర మధ్యలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నా రాహుల్ గాంధీకి ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది.
తెలంగాణలో మొత్తం 16 రోజుల పాటు యాత్ర చేస్తుండగా 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా మొత్తం 375 కిలోమీటర్లు నడవబోతున్నారు. ఈ రోజు యాత్ర ముగిసిన తర్వాత వచ్చే మూడు రోజులు దీపావళి కారణంగా విరామం ఇవ్వబోతున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో రాహుల్ పాదయాత్ర తెలంగాణలో మరింత అసక్తి నేలకొంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య ఉంటే గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి పెద్ద గుదిబండగా మారాయి. దాంతో తెలంగాణలో యాత్ర ఎంత వరకు విజయవంతం అవుతుందనేది ముందు ముందు చూడాలి. వచ్చే ఏడాది జరగబోతున్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు రాహుల్ యాత్ర ఉపయోగపడుతుందంటూన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.