ఒంటరి అవుతున్న మెగాస్టార్

మెగా క్యాంప్ లో పరిస్థితులు చిత్రంగా వున్నాయి. చిరంజీవి వెళ్లి జగన్ ను కలిసిన దగ్గర నుంచి ఆయనను విపరీతంగా ట్రోల్ చేసారు. ఈ ట్రోలింగ్ ఎవరు చేసారు? వెనుక ఏ రాజకీయ పార్టీ…

మెగా క్యాంప్ లో పరిస్థితులు చిత్రంగా వున్నాయి. చిరంజీవి వెళ్లి జగన్ ను కలిసిన దగ్గర నుంచి ఆయనను విపరీతంగా ట్రోల్ చేసారు. ఈ ట్రోలింగ్ ఎవరు చేసారు? వెనుక ఏ రాజకీయ పార్టీ వుందన్నది బహిరంగ రహస్యం. అది అలా వుంచితే సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య విడుదల అన్నది ముందే ఫిక్స్ అయింది. డిసెంబర్ లో వస్తుందనుకున్న బాలయ్య వీర సింహా రెడ్డిని పట్టుపట్టి మరీ సంక్రాంతికి తెచ్చారు. ఇప్పుడు రెండు వైపులా ఫ్యాన్స్ కాలు దువ్వుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో తనను ట్రోల్ చేసిన వారితోనే సోదరుడు పవన్ వెళ్లి పొత్తు పెట్టుకుంటున్నాడు. సరే అది రాజకీయం అనుకుందాం. మెగాస్టార్ అంటే సరిపడదు నందమూరి బాలయ్యకు అన్నది టాలీవుడ్ లో ఓపెన్ టాక్. అన్ స్టాపబుల్ చాట్ షో కి చిరంజీవిని పిలుద్దాం అంటే బాలయ్య వద్దని వీటో చేసారని తెర వెనుక గుసగుసలు వున్నాయి. కానీ అదే షో కి పవన్ ను మాత్రం బహిరంగంగానే పిలిచారు.

ఇంకో పక్క మెగా బావ మరిది అల్లు అరవింద్ నేరుగా నందమూరి బాలయ్యతో బంధాలు పెనవేసుకుంటున్నారు. తమ తండ్రి తరంలోనే నందమూరి-అల్లు బంధం వుందని ఆయన గతంలోనే చెప్పారు. అంటే మెగాబంధం పెనవేసుకోవడం కన్నా ముందుగానే ఈ బంధం వుందని చెప్పకనే చెప్పారు. లేటెస్ట్ గా తన మూడో కొడుకు సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా నందమూరి బాలయ్యనే రప్పిస్తున్నారు.

ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్లి తన సినిమా ల మీద కాలు దువ్వుతున్నవారితో, తను అంటే కిట్టని వారితో, తనను ట్రోలింగ్ చేయించిన వారితో పొత్తులు పెట్టుకుని, చేతులు కలుపుకుని చెట్టాపట్టాలు వేస్తుంటే మెగాస్టార్ చిరు ఒంటరి అయిపోతున్నట్లు అనిపించడం లేదా?