కొత్త చట్టంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు

కొత్త‌గా వ‌చ్చిన భారత్ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టం ద్వారా కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి రికార్డ్‌లోకి ఎక్కారు. చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చిన రెండో రోజే ఆయ‌నపై కేసు…

కొత్త‌గా వ‌చ్చిన భారత్ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టం ద్వారా కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి రికార్డ్‌లోకి ఎక్కారు. చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చిన రెండో రోజే ఆయ‌నపై కేసు న‌మోదు అయ్యింది. ఎమ్మెల్యే త‌మ విధుల‌కు ఆటంకం క‌లిగించార‌ని జిల్లా ప‌రిష‌త్ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న‌పై సెక్ష‌న్ 122, 126(2) కింద కేసు న‌మోదు చేశారు.

కాగా నిన్న జ‌రిగిన కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించి నిరసనకు దిగారు. డీఈఓ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నార‌ని ఆయ‌న్ను సస్పెండ్ చేయాలని.. అలాగే దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. దీంతో జెడ్పీ సీఈవో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కొత్త చ‌ట్టం ప్ర‌కారం కేసు న‌మోదు చేశారు. 

కాగా ఇటీవల హుజురాబాద్‌ నియోజకవర్గంలో విద్యారంగానికి సంబంధించి నెలకున్న సమస్యలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించడంతో.. ఆ సమావేశానికి హాజరైన ఎమ్‌ఈవోలను డీఈవో బదిలీ చేసిన విష‌యం తెలిసిందే. పోలీసు కేసులోను కొత్త చ‌ట్టం ద్వారా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రికార్డ్‌లోకి ఎక్కారు.