బాబు స్ట్రాటజీ: అప్పుడు చీలరాదు.. ఇప్పుడు చీల్చి తీరాలి!

హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు అంటే.. తెలంగాణలో అసలు తెలుగుదేశం పార్టీ బతికి ఉందా అనే ప్రశ్న వస్తుంది. పార్టీ…

హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు అంటే.. తెలంగాణలో అసలు తెలుగుదేశం పార్టీ బతికి ఉందా అనే ప్రశ్న వస్తుంది. పార్టీ బతికే ఉన్నదని చాటి చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు నానా పాట్లు పడుతున్నట్లుగా కనిపిస్తుంది.

తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని ఆయన పార్టీ నాయకులకు మార్గదర్శనం చేస్తున్నారు. ఇకమీదట ప్రతి రెండు వారాలకు ఒకసారి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణానికి సమయం కేటాయిస్తానని కూడా చంద్రబాబు ఒక హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సమావేశంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని పోటీకి దించడంపై కసరత్తు చేయాలని చంద్రబాబు సూచించడం ప్రత్యేకత!

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి సారధిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పార్టీని పోటీ చేయించి తీరాలని చాలా ప్రయత్నించినప్పటికీ చంద్రబాబు నాయుడు నిలువరించిన సంగతి తెలిసిందే. అసలు పార్టీని పోటీకి బరిలో దించకుండా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అప్పటిదాకా పార్టీ కోసం కష్టపడిన కాసాని జ్ఞానేశ్వర్ అలిగి రాజీనామా చేసి వెళ్లిపోయారు కూడా.

కేవలం కొన్ని నెలలు గడిచేసరికి తెలంగాణ తెలుగుదేశం మీద చంద్రబాబుకు అంత శ్రద్ధ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయించాలని ఆయన ఆదేశిస్తున్నారు. నిన్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ వద్దనుకున్నప్పటికీ.. ఇవాళ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయించాలనుకుంటున్నప్పటికీ చంద్రబాబు ప్రతిదీ ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఉండేది. అలా భారత రాష్ట్ర సమితి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు, తద్వారా అంతిమలబ్ది కాంగ్రెస్ పార్టీకి చేకూరేందుకు.. చంద్రబాబు అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా తన శిష్యుడు రేవంత్ రెడ్డికి మేలు చేయడానికి చేశారనేది రాజకీయ వర్గాలలో పుకారు. ఎనిమిది నెలలు గడిచేసరికి ఇప్పుడు పరిస్థితి వేరు.

ఇప్పుడు అంతో ఇంతో తన శిష్యుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. దానిని సొమ్ము చేసుకుని విజయం సాధించడానికి భారత రాష్ట్ర సమితి గట్టిగానే ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయాలని చంద్రబాబు నాయుడు కోరిక. అందుకోసమే నిన్న పోటీ వద్దని – ఇవాళ పోటీ చేయాలని ఆయన పార్టీని తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా కీలుబొమ్మలా ఆడిస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

11 Replies to “బాబు స్ట్రాటజీ: అప్పుడు చీలరాదు.. ఇప్పుడు చీల్చి తీరాలి!”

  1. ముక్కోడి పార్టీ ఎప్పుడో మూసి లో మురిగిపోయింది ,కవిత లిక్కర్ స్కాం ,హీరోయిన్స్ తో కేటీఆర్ నీచ స్కాం , కాళేశ్వరం ముక్కోడి స్కాం, హరీష్ రావు గాడి గొర్రెల స్కాం అన్ని కలిసి ముక్కోడిని మూసి డ్రైనేజీ లో కలిపారు తెలంగాన ప్రజలు

  2. మీ ప్రకారం టీడీపీ కి అక్కడ ఓట్లు ఏమి లేవు కదా….అందులో ను మీ బాస్ పార్టీ కి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం లో ఘన మైన చరిత్ర ఉంది అందువల్ల టీడీపీ పోటీ చేసిన అది మీకు లాభమే కానీ నష్టం మాత్రం కాదు కదా

  3. Appudu TDP party AP lo struggle lo undhi…. focus, concentration anthaa ikkade pettali…. ippudu AP lo strong gaa ruling lo undhi….so focus shift chesi Telanagana lo rewive cheyyadaniki idhi sari ayina samayam….. idhi assalu vishayam…. TDP ki congress ki edho oka relationship create chesthe use ledhu…. paatha paachipoyinaa scripts vaaduthunnaru…. update avvandi….

    1. focus shift aithe AP malli weak avutundi adhi asalu vishayam. ila shift lu marchukuntu kurchunte AP lo permanentga shift marchutaru. eesari Telangana meeda focus pedite, akkada ikkada kadu ekkadekkado dimpi aarestaru

  4. ఈయన ఎలా చేసినా ఏమీ చేసినా ప్రజలు ఎవరిని గెలిపించాలో వారినే గెలిపిస్తారు. లోకసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అయిన BRS కే ఒక్క సీటు ఇవ్వకుండా ఓడించారు.

Comments are closed.