మళ్లీ చేతులు కడుక్కునే టైమ్ వచ్చింది

కరోనా టైమ్ లో చేతులు ఒకటికి రెండుసార్లు కడుక్కోవడం, శానిటైజర్ రాసుకోవడం చాలామందికి అలవాటైంది. అయితే ఆ తర్వాత చాలామంది ఆ అలవాటు మానేశారు. ఇప్పుడు మరోసారి చేతులు శుభ్రం చేసుకునే టైమ్ వచ్చింది.…

కరోనా టైమ్ లో చేతులు ఒకటికి రెండుసార్లు కడుక్కోవడం, శానిటైజర్ రాసుకోవడం చాలామందికి అలవాటైంది. అయితే ఆ తర్వాత చాలామంది ఆ అలవాటు మానేశారు. ఇప్పుడు మరోసారి చేతులు శుభ్రం చేసుకునే టైమ్ వచ్చింది. మాస్క్ పెట్టుకోకపోయినా, చేతులకు శానిటైజర్ తప్పనిసరి అయింది.

దీనంతటికీ కారణం నోరో వైరస్. అవును.. హైదరాబాద్ ను నోరో వైరస్ వణికిస్తోంది. వారం రోజుల వ్యవథిలోనే పాతబస్తీలో వెయ్యికి పైగా కేసులు, దీనికి తోడు రోజుకు కనీసం వంద నుంచి 120 కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీన్ని బట్టి ఈ నోరో వైరస్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ వైరస్ సోకడానికి ప్రధాన కారణం కలుషిత జలం. మంచి నీరు తాగకపోవడం, దానికితోడు నిల్వ ఉంచిన ఆహారం తినడంతో ఈ సీజన్ లో ఇది గట్టిగా వ్యాపిస్తోంది. దీనికి సంబంధించి తాజాగా జీహెచ్ఎంసీ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, ఇంటిని పరిసరాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించింది. ఇంతకీ ఈ నోరో వైరస్ లక్షణాలేంటో తెలుసా?

ఈ వైరస్ సోకిన వ్యక్తులకు చలిజ్వరం వస్తుంది. మరోవైపు ఒళ్లు డీహైడ్రేట్ అయిపోతుంది. కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు అవుతాయి. ఈ లక్షణాల్లో కనీసం 2 కనిపిస్తే.. వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

5 Replies to “మళ్లీ చేతులు కడుక్కునే టైమ్ వచ్చింది”

  1. మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

      1. 2014 లాగే 2024 లో కూడా మేనిఫెస్టో మట్ట కిడసా….

        పాపం ఎర్రి జనాలు మిమ్మల్ని నమ్మేసి …ఓట్లేశారు.

      2. 2014 లాగే 2024 లో కూడా మేనిఫెస్టో మ!ట్ట కిడసా….

        పాపం ఎ!ర్రి జనాలు మిమ్మల్ని నమ్మేసి …ఓట్లేశారు.

Comments are closed.