మోడీ ఇమేజ్ పెరిగిందా.. త‌రిగిందా!

ఇందిర అయినా, వాజ్ పేయి అయినా.. యుద్ధాలు చేసి విజ‌యాలు సాధించ‌డం వ‌ల్ల జాతి దృష్టిలో శిఖ‌రాగ్ర‌స్థాయిలో నిలిచారు.

నిస్సందేహంగా మోడీ ఇమేజ్ పెరుగుతున్న ప‌రిస్థితి. పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదానికి పూర్తి చెక్ పెట్ట‌డానికి ఇండియా పూనుకుంద‌ని.. ప్ర‌పంచంలో ఇస్లామిక్ టెర్ర‌రిజాన్ని వ్య‌తిరేకించే వాళ్లంతా భావించారు! ఉగ్ర‌దాడుల‌కు ఇండియా స‌మాధానం ఇవ్వ‌డాన్ని వేరేలా చూడ‌న‌క్క‌ర్లేద‌ని కొంద‌రు అమెరిక‌న్ ప్ర‌ముఖులు, బ్రిట‌న్ రాజ‌కీయ ప్రముఖులు కూడా ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అడిగితే సాయానికి కూడా ర‌ష్యా సై అంది. ఇజ్రాయెల్ త‌మ‌కో అవ‌కాశం ఇవ్వ‌మ‌న్న‌ట్టుగా స్పందించిన ప‌రిస్థితి.

అమెరికా ద్వంద్వ వైఖ‌రినొక్క‌టీ ప‌క్క‌న పెడితే, ప్ర‌త్యేకించి ఎప్పుడు ఏం మాట్లాడ‌తాడో ఎవ‌రికీ తెలియ‌ని ట్రంప్ ధోర‌ణిని ప‌క్క‌న పెడితే.. పాక్ ను ఇండియా దెబ్బ‌కొడితే చూడాల‌నే చాలా ప్ర‌పంచం ఎదురుచూసింది. ట‌ర్కీ, చైనా, అజ‌ర్ బైజాన్.. ఈ మూడే పాక్ కు ప్ర‌ధాన మ‌ద్ద‌తు. వీటిల్లో ఇండియా యుద్ధంలో మునిగితేలితే చైనాకే ఇబ్బంది.

ఇండియా ఎప్పుడూ ఒక కన్జూమ‌ర్ గా ఉండ‌ట‌మే చైనాకు కావాల్సింది. ఇండియా యుద్ధం వైపు వెళితే చైనా మార్కెట్ కు పెద్ద దెబ్బ ప‌డుతుంది. ఇండియా వినియోగం త‌గ్గితే చైనా మార్కెట్ దెబ్బ‌తింటుంది. అస‌లే అమెరికా టారీఫ్ ల దెబ్బ‌తో ఇక్క‌ట్ల‌లో ఉన్న చైనాకు ఇండియా వినియోగం కూడా తగ్గిపోతే మ‌రింత ఇబ్బంది. కాబ‌ట్టి.. ఇండియాకు ఎదురెళ్లి పాక్ వైపు నిలిచి యుద్ధం చేసే తీరిక చైనా కు ఉండ‌దు. ఏదో దొంగ చాటు స‌హ‌కార‌మే త‌ప్ప .. అంత‌కు మించి చైనాకు కూడా దృశ్యం లేదు.

ఇలా ప్ర‌పంచం మొత్తం పైకి పాక్ కు వ్య‌తిరేకంగా క‌నిపిస్తున్న ద‌శ‌లో.. పాక్ మిల‌ట‌రీ డొల్ల‌త‌నం కూడా బ‌య‌ట‌ప‌డుతున్న వేళ‌.. ఊహించ‌ని ట్విస్ట్ లా ఇండియా వైపు నుంచి కూడా కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. పాక్ కూడా అదే ప్ర‌క‌ట‌న చేసింది. అయితే పాక్ అలా ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా డ్రోన్ల‌ను ఎగ‌రేస్తోంద‌ని ఇండియా చెబుతోంది! అయితే.. పాక్ అంతే! ఇది కూడా తెలీదా! అన్నీ తెలిసీ మ‌ళ్లీ ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం కూడా అన‌వ‌స‌రం క‌దా!

మ‌రి ఈ మొత్తం వ్య‌వ‌హారంలో భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఇమేజ్ మాత్రం.. ఒక్క‌సారిగా చ‌ప్పున పైకెళ్లి, ఆ ఆ త‌ర్వాత అభిమాన‌గ‌ణం కూడా ఉస్సూరుమ‌నే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పాక్ పై సైనిక చ‌ర్య‌ను చేప‌ట్ట‌డాన్ని భార‌తీయులు ముక్త‌కంఠంతో ఆమోదించారు. రాజ‌కీయంగా, సామాజికంగా పాక్ వైఖ‌రిపై ఇన్నేళ్ల‌లో భార‌తీయుల్లో పెల్లుబుకిన అస‌హ‌నం అంతా ఇంతా కాదు. పాక్ ప్ర‌జ‌ల‌పై భార‌తీయుల‌కు ద్వేషం లేదు, పాక్ పాల‌కులు, మిల‌ట‌రీ ఆగ‌డాల‌పై, ఉగ్ర‌వాదంపై అస‌హ్య‌భావ‌న ఉంది.

ఇన్నాళ్లూ వాట‌న్నింటినీ భ‌రిస్తూ వ‌చ్చిన దేశం పాక్ పై చ‌ర్య‌ల‌ను కోరుకోవ‌డంలోనూ, చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించ‌డంలోనూ ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు. మ‌న‌మేం దురాక్ర‌మ‌ణ చేయ‌మ‌న‌లేదు. దేశంపైకి దుండ‌గులు ప‌డి చంపుతుంటే.. ఎందుకు భ‌రించాల‌నే ధ‌ర్మాగ్ర‌హం ఇది. ఈ ఆగ్ర‌హం మేర‌కు ఎవ‌రు స్పందించినా భార‌తీయులు ఆ నాయ‌క‌త్వానికి జేజేలు ప‌లికారు.

ఇందిర అయినా, వాజ్ పేయి అయినా.. యుద్ధాలు చేసి విజ‌యాలు సాధించ‌డం వ‌ల్ల జాతి దృష్టిలో శిఖ‌రాగ్ర‌స్థాయిలో నిలిచారు. అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు పాక్ మ‌రింత బ‌ల‌హీనం అయ్యింది. ఇందిర యుద్ధం చేసిన నాడు.. పాక్ త‌ల‌స‌రి ఆదాయం భార‌త్ తో దాదాపు స‌మానంగా ఉండింది. భార‌త్, పాక్ జీవ‌న శైలి దాదాపు ఒకే స్థాయిలో ఉండిన స‌మ‌యం అది. పాక్ లో అప్ప‌టికే ప్ర‌జాస్వామ్యం అనేది అతిథి లాంటిదే అయినా.. అప్పుడు ఇండియా, పాక్ ప్ర‌జ‌ల జీవ‌న‌స్థితి గ‌తుల‌న్నీ ఒకే స్థాయిలో ఉండేవి. అయితే ఆ త‌ర్వాత పాక్ దారుణంగా ప‌త‌నం అయ్యింది. బంగ్లా విజ‌భ‌జన త‌ర్వాత పాక్ ప్ర‌స్తుత భూభాగ‌మే మిగిలాకా.. ప‌న్నుల ఆదాయం త‌గ్గిపోయింది.

దీనికి తోడు రాజ‌కీయ అనిశ్చితి, మిల‌ట‌రీ జోక్యం తీవ్రం కావ‌డం, ముషార్ర‌ఫ్ లాంటి వాళ్లు అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం, ప్ర‌భుత్వాల‌ను మిల‌ట‌రీ కూలదోయ‌డం, తాము కోరుకున్న వారిని నియ‌మించుకోవ‌డం, హెచ్చుమీరిన అవినీతి, దీనికితోడు విదేశీ సాయాలు త‌గ్గిపోవ‌డం, ఆ మ‌ధ్య వ‌ర‌ద‌లు కూడా పాక్ ను కుంగ‌దీశాయి. ఇప్పుడు భార‌తీయుల‌, పాక్ ప్ర‌జ‌ల జీవ‌న స్థాయిల‌ను గ‌మ‌నిస్తే.. ఇండియా ఎన్నో రెట్ల మెరుగైన ప‌రిస్థితుల్లో ఉంది.

పాక్ ప‌రిస్థితి ముక్కుతూ మూలుగుతున్న‌ట్టుగా ఉంది. ప్ర‌జ‌ల్లో తిరుగుబాటు వ‌చ్చి..పాల‌కుల‌ను త‌ర‌మ‌డానికి మ‌రెంతో దూరం లేన‌ట్టుగా ఉంది ప‌రిస్థితి! మ‌రి ఇప్పుడు ఇండియా గ‌నుక ఉగ్ర‌వాద శిబిరాల‌ను పూర్తిగా విచ్ఛిన్నం చేసి.. వాటిని ఏరివేసి ఉంటే.. అంత‌కు ఇంత‌కు మించిన స‌రైన స‌మ‌యం ఉండేది కాదు. పాకిస్తాన్ అనేది ఒక విఫ‌ల రాజ్యంగా మిగులుతున్న వేళ .. ఇదే అద‌నుగా పాక్ ఉగ్ర‌వాద శిబిరాల‌ను మాయం చేయాల్సిన అవ‌స‌రం కూడా ఇండియాకు ఉంది. ఎందుకంటే.. పాక్ త‌దుప‌రి గ‌తి పూర్తిగా ఉగ్ర‌వాదుల చేతుల్లోకి వెళ్లిపోవ‌డ‌మే!

ఇప్పుడు ఆ దేశం సైన్యం చేతిలో ఉంది. ఆ సైన్యం ఉగ్ర‌వాదులతో స‌హ‌గ‌మ‌నం చేస్తోంది. రేపు సైన్యాన్నే ఉగ్ర‌వాదులు పూర్తిగా త‌మ చేతుల్లోకి తీసుకోనూవ‌చ్చు! ఇందులో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. తాలిబ‌న్ల త‌ర‌హాలో పాక్ ను పూర్తిగా ఉగ్ర‌వాదులే పాలించ‌వ‌చ్చు. అప్పుడు అది మ‌రింత ప్ర‌మాదక‌రంగా మారుతుంది. మ‌న శాంతి వ‌చ‌నాలు , అంత‌ర్జాతీయ సంబంధాల లెక్క‌లు, ట్రేడ్ ఈక్వెష‌న్లు.. ఇవ‌న్నీ ఎలా ఉన్నా.. పాక్ లో టెర్ర‌ర్ క్యాంపులు ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే!

మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో.. వాటిని తుద‌ముట్టించ‌డ‌మే ప‌నిని భార‌త ప్ర‌భుత్వం మొద‌లుపెట్టింద‌నుకున్న ద‌శ‌లో.. స‌గ‌టు భార‌తీయుడిలో మోడీ హీరోగా నిలిచాడ‌న‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు. అయితే స్ప‌ష్ట‌మైన ల‌క్ష్య సాధన లేకుండా కాల్పుల విర‌మ‌ణ అనేది మోడీ స్థాయిని త‌గ్గించి వేసింది అన‌డం క‌న్నా.. ఇందిర‌ను దేశానికి గుర్తు చేసింద‌న‌డం స‌మంజ‌సం.

ఇండియా కాల్పుల విర‌మ‌ణ త‌ర్వాత ఒక్క‌సారిగా ఇందిరా గాంధీ తెగువ దేశానికి గుర్తువ‌చ్చింది! సోష‌ల్ మీడియాలో ఇందిర ప్ర‌సంగాలు, 1971 యుద్ధం తాలూకు గురుతులు వైర‌ల్ గా మారాయి! ఇలా ఎందుకు జ‌రిగిందో ప్ర‌త్యేకంగా వివ‌రించ‌న‌క్క‌ర్లేదు! మోడీ నుంచి దేశం ఏం ఎక్స్ పెక్ట్ చేసిందో అవి అర్థ‌మ‌య్యేలా చేస్తూ ఉన్నాయి! అవి కాకుండా ఇంకేం చెప్పినా.. జ‌నాల‌కు ఎక్క‌దు. ఎందుకంటే.. పాక్ ఉగ్ర‌వాదం ఇప్ప‌టికీ ఇండియాకు పొంచి ఉన్న ప్ర‌మాదం!

79 Replies to “మోడీ ఇమేజ్ పెరిగిందా.. త‌రిగిందా!”

  1. ఇంట్లో తీరిగ్గా కూర్చుని వేడి వేడి కాఫీ తాగుతూ సరదాగా కాలక్షేపంగా టీవీలో వస్తున్న యుద్దవార్తలు చూస్తున్న మనకు సడేన్ గా కాల్పులవిరమణ అనగానే సస్పెన్స్ సినిమా రంజుగా ఉన్నప్పుడు కరెంట్ పోతే ఎలా చిరాకు పుడుతుందో అంత పుట్టి మోడీని తిట్టటం మొదలెట్టాము.

    తప్పు లేదు. మన మనస్తత్వమే అంత

    ఎందుకు POK లాక్కు రాలేదు. ఎందుకు పాకిస్తాన్ మీద బాంబులు వేయలేదు. ఎందుకు యుద్దం ఆపేసారు అంటూ తిట్టి పోయటం మొదలెట్టారు.

    ఇంతకీ కాల్పుల విరమణ మనమే అడిగినట్లు ఈ వ్యాసం రాసినవాడు అన్నాడు. వీడి GK శూన్యం అని అర్ధం అవుతూనే ఉన్నది.

    పోతే ఇప్పుడు వీరంగం తొక్కుతున్న ఇదే జనం రేపు యుద్దం మూలంగా ధరలు పెరిగితే ఆ పాచినోళ్లతోనే మోడీని తిట్టి పోస్తారు.

    మనకు చిన్న అశాంతి కలగకూడదు. సరిహద్దుల్లోని జనం చచ్చినా ఫర్వాలేదు.

    మోడీ ఏమైనా యుద్దం చేస్తానని బీరాలు పలికాడా ?

    ఉగ్రవాదుల నడ్డి విరుస్తానని అన్నాడు తప్ప POK ను పీక్కొస్తాము బలూచీస్తాన్ ను లాక్కొస్తామని ఎక్కడైనా అన్నాడా ?

    అన్నట్లే ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం చేసాడు., పాకిస్తాన్ ఆర్మీ జోక్యం చేసుకుంటే వాళ్ళ ఎయిర్ బేస్ లను నాశనం చేసాడు. వాళ్ళ డ్రోన్లనుండి సరిహద్దు ప్రజలను కాపాడాడు.

    రష్యా మూడేళ్ళుగా యుద్దం చేస్తున్నది. ఏమి సాధించింది అలాగే ఇజ్రాయిల్

    ఇక్కడ పాకిస్తాన్ నడ్డి విరిచాము. ఇంకా యుద్దం చేస్తూ పోతే ఈ జనమే మోడిని ధరలు పెరిగినందుకు తిట్టిపోస్తారు

    పెవిలియన్లో మంచినీళ్ళు అందించే వాడు కూడా ధోనీ ఎలా బాటింగ్ చేయాలో చెప్తాడు

  2. యుద్ధం మోడీ మొదలెట్టాదా? రాసినోడికి బుద్ది ఉన్నదా? ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకుంటానాన్నాడు తప్ప యుద్ధం లోకి వెళతాను అన్నాడా? ఉగ్రవాదుల నడుం విరగ్గొట్టాదా లేదా? జిహాదీ ల మైండ్ సెట్ ఎవడూ మార్చలేడు. మార్చాగలిగితే సిరియా పాలస్తీనా సూడాన్ లెబనాన్ etc ఎప్పుడో మారి ప్రశాంతంగా ఉండేవి

    1. ఉగ్రస్తావరాలు దెబ్బ తీస్తే పాకిస్తాన్ సైన్యం బాంబులు వేసింది. వాటిని ఆపటమే కాక పాకిస్తాన్ సైన్యంమూలాధారాలాన్ని సర్వనాశనం చేసాము. ఇంకా ఏమి చేయాల

      POK పెంట బాలూచిస్తాన్ పెంట మనకెందుకు. ఇప్పటికే దేశంలో ఉన్న విషశర్పాలు చాలాకనా?

          1. కాంగ్రెస్ కాలం లో ఎన్నో బాంబ్ బ్లాస్ట్ లు జరిగాయి..

            ముంబై తాజ్ హోటల్..గోకుల్ చాట్..లుంబిని పార్క్…ముంబయి సీరియల్ బ్లాస్ట్ లు…

            ఒక్కడు అయినా పాకిస్తాన్ పై యుద్ధం చెయ్యాలి అని ఎందుకు అడగలేదు…

            నెహ్రూ కి చేతగాక Pok ఇచ్చాడా పాకిస్తాన్ కి…

            ఇందిర గాంధీ కి చేత కాక బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి POK వదిలి వేసిందా…

            పీవీ నరసింహ రావు చేతకాక POK తీసుకొని రాలేక పోయారా…

            మన్మోహన్ సింగ్..సోనియా గాంధీ అన్ని బాంబ్ బ్లాస్ట్ లు జరిగితే ఏమి పీకారు…

            ఇవాళ పాకిస్తాన్ పై యుద్ధం చేసే ధైర్యం మోడీ కి లేదా అనే బానిస లు కాంగ్రెస్ కాలం లో మీ ప్రధానుల పై నమ్మకం లేక ఇవ్వాళ మోడీ పైనే నమ్మకం తో ఉన్నారా లేక మోడీ నీ ఎగతాళి చేయటం కోసం పోస్ట్ లు పెడుతున్నారా… మీకు మీ కాంగ్రెస్ ప్రధానుల పై నమ్మకం లేక చివరికి మోదీ మాత్రమే POK నీ స్వాధీనం చెయ్యగలడు అని మోడీ పై నమ్మకం పెట్టుకున్నందుకు మీకు కృతఙ్ఞతలు…ఒక వేలు మోడీ వైపు చూపిస్తే నాలుగు వేళ్ళు మి వైపు చూపిస్తాయి… ఆ లంగా ది 93000 మంది పాకిస్థాన్ ఆర్మీని వదిలేసింది… బంగ్లాదేశ్ కోసం యుద్ధం టైం లోనే POK ని కొంచెం అక్రమించారు భారత్ దళాలు కానీ మన చేతకాని భారత్ ప్రభుత్వం వల్ల మళ్ళీ POK ని వెనక్కి ఇచ్చేసారు, 93000 మంది పాకిస్థాన్ సైన్యం ని విడుదల చేసారు ఎలాంటి కండిషన్ లు లేకుండా…. కనీసం సింధు జలాల ఒప్పందం కూడా రద్దు చేయలేకపోయుంది…Subbu Maddela ఆరే ఎర్రిపూక ఉగ్రదాడులకు, యుద్ధం కి తేడా తెలుసుకో. 1947 నుండి 1998 వరకు, 2004 నుండి 2014 మధ్య ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగాయి వాళ్ళను ఏమి పీకారు.. దేశం మధ్య లో ఉండే నగరాల్లో బాంబు బ్లాస్ట్ లు జరిగాయి ఇపుడు 3 సార్లు కాస్మిర్ లోయ కే పరిమితము అయుంది ఉగ్రవాదం అది కూడా ఆర్టికల్ 370 తీసేసాక, 3 సార్లు వాళ్ళ ప్లేస్ లకు వెళ్లి దాడి చేసి, ఉగ్రవాదులను లేపేసి వచ్చారు, ఇపుడు పూర్తి స్థాయి యుద్ధం చేద్దాం మనమే గెలుస్తాం 2 రోజుల్లో ఇది పాకిస్తాన్ వాళ్ళకి కూడా తెలుసు.. తరవాత ఆ పాకి లను భారత్ లో కలుపుకొని 10/20 ఏళ్లలో ఇస్లామిక్ రాజ్యం చేయాలా వాళ్ళ జనాభా నిష్పత్తి పెంచి..

          2. ఒరేయ్ నిన్ను తిట్టటం ఎంతరా దొంగ కులం పత్రం తో బ్రతికే వెధవా

          3. నీలాగా సంకజాతి గాడిని, అంటే కులం బయట ఒకటి లోపల ఒకటి ఇంట్లో ఒక తండ్రి బయట ఒక తండ్రి బాపతు కాదులేరా

          4. ఎదవా, మోడీ గెలిచినా మీరు ఏడుస్తారు. రేపు యుద్ధలో ధరలు పెరిగినా ఏడుస్తారు. నీలాంటి క్రాస్ బ్రీడ్ గాళ్ళు

          5. ఒ!రే!య్ పూ!కా … గెలిచినా అన్నావు అంటే ఓడిపోయాడు అని చెపుతున్నావా రా నీచుడా అందుకే నిన్ను పాకిస్తాన్ లో పాతెయ్యలి మూర్కుడా

  3. 1971 ఇందిరా గాంధీ పోలికలు తెచ్చారు

    యుద్ధం గెలిచి 93000 సైనికులు ను బందిగా పట్టుకుని లాహోరు గెలిచి, హాజీ పీర్ చెక్ పోస్ట్ పట్టుకుని సాధించిన తర్వాత ఇందిరా ఏమి చేసింది? ఒక్క దమ్మిడి లాభం లేకుండా యుద్ధం విజయాలన్ని పాకిస్తాన్ కు వదిలేసింది తప్ప మన POW లను వెనక్కి తెచ్చిందా, కాశ్మిర్ మీద శాశ్వత ఒప్పందం కుదుర్చుకున్నాదా? 1947 అక్టోబర్ దాడిలో పాకిస్తాన్ ఆక్రమించిన POK ను LOC గా ఒప్పుకున్నది. ఇదా విజయం వీరనారి అంటే

  4. 1971యుద్ధం లో గెలిచిన ఇందిరా గాంధీ POK తెచ్చిందా? లేకపోతే కాశ్మిర్ మీద ఏమైనా ఒప్పందం కుదుర్చుకున్నాదా? 1947 అక్టోబర్ లో పాకిస్తాన్ ఆక్రమించిన POK నే LOC గా ఒప్పుకోవటమేనా ఘవిజయం అంటే

  5. 1971లో గెలిచి ఇందిరా గాంధీ దేశానికి తెచ్చిన లాభం ఏమిటో చెప్పరా? POK ను LOC గా ఒప్పుకోవటమే విజయమా, చెప్పరా

    1. LOC అప్పటికే ఉంది… మన వాళ్ళు మూసికొని వెనక్కి వచ్చారు 

      1. LOC అంటే పాకిస్తాన్ 1947 అక్టోబర్ లో ఆక్రమించుకున్న కాశ్మిర్ సరిహద్దులు

      2. వీడేమిటి ఏది పెట్టినా తీసేస్తున్నాడు. వీడు రాసిన చెత్త తప్పు అని బయట పడుతుందానా

    2. యుద్ధరంగంలో మన సైన్యానికి దక్కిన అతి పెద్ద విజయం, శతృదేశాన్ని రెండు ముక్కలు చెయ్యడం చిన్న విషయం కాదు. బంగ్లాదేశ్ పనికి మాలిన దేశమే కావచ్చు, మన పక్కలో‌ రెండువైపులా పాకిస్థాన్ ని పెట్టుకోవడం కన్నా బంగ్లాదేశ్ ని భరించడం బెటర్ కదా‌. అక్కడ అవామీ లీగ్ అధికారంలో ఉన్నంత కాలం మన అదుపులోనే ఉండేది, అందుకే కదా ఇప్పుడు హసీన కి అశ్రయం ఇచ్చింది మన ప్రభుత్వం. POK కోసం డిమాండ్ చెయ్యలన్నా, యుద్ధం ముగింపు మీద అప్పటికే అగ్రరాజ్యాల ఒత్తిడి ఉండింది, ఇప్పుడున్నంత ఆర్ధిక స్వతంత్రత లేని రోజుల్లో, వాళ్ల ఒత్తిడిని తట్టుకుని ముందుకెళ్లడం అంత సులువు కాకపోవచ్చు. 

    3. యుద్ధరంగంలో మన సైన్యానికి దక్కిన అతి పెద్ద విజయం, శతృదేశాన్ని రెండు ముక్కలు చెయ్యడం చిన్న విషయం కాదు. బంగ్లాదేశ్ పనికి మాలిన దేశమే కావచ్చు, మన పక్కలో‌ రెండువైపులా పాకిస్థాన్ ని పెట్టుకోవడం కన్నా బంగ్లాదేశ్ ని భరించడం బెటర్ కదా‌. 

      1. అవామీ లీగ్ అధికారంలో ఉన్నంత కాలం బంగ్లా మన అదుపులోనే ఉండేది, అందుకే కదా ఇప్పుడు హసీన కి అశ్రయం ఇచ్చింది మన ప్రభుత్వం. POK కోసం డిమాండ్ చెయ్యలన్నా, యుద్ధం ముగింపు మీద అప్పటికే అగ్రరాజ్యాల ఒత్తిడి ఉండింది, ఇప్పుడున్నంత ఆర్ధిక స్వతంత్రత లేని రోజుల్లో, వాళ్ల ఒత్తిడిని తట్టుకుని ముందుకెళ్లడం అంత సులువు కాకపోవచ్చు. 

      2. అక్కడ అవామీ లీగ్ అధికారంలో ఉన్నంత కాలం మన అదుపులోనే ఉండేది, అందుకే కదా ఇప్పుడు హసీన కి అశ్రయం ఇచ్చింది మన ప్రభుత్వం. POK కోసం డిమాండ్ చెయ్యలన్నా, యుద్ధం ముగింపు మీద అప్పటికే అగ్రరాజ్యాల ఒత్తిడి ఉండింది, ఇప్పుడున్నంత ఆ**ర్ధి&&క స్వతంత్రత లేని రోజుల్లో, వాళ్ల ఒత్తిడిని తట్టుకుని ముందుకెళ్లడం అంత సులువు కాకపోవచ్చు. 

    4.  అక్కడ అవామీ లీగ్ అధికారంలో ఉన్నంత కాలం మన అదుపులోనే ఉండేది, అందుకే కదా ఇప్పుడు హసీన కి అశ్రయం ఇచ్చింది మన ప్రభుత్వం. 

    5. పీఓకె కోసం డిమాండ్ చెయ్యలన్నా, యుద్ధం ముగింపు మీద అప్పటికే అగ్రరాజ్యాల ఒత్తిడి ఉండింది, ఇప్పుడున్నంత ఆ#ర్ధి#క స్వతంత్రత లేని రోజుల్లో, వాళ్ల ఒత్తిడిని తట్టుకుని ముందుకెళ్లడం అంత సులువు కాకపోవచ్చు. 

    6. అప్పుడు మన బడ్జెట్ సైజ్ 4000 కో*ట్లు అయితే 325 కో*ట్లు శరణర్థుల కోసం, రెండు వందల కో*ట్లు బాంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం కి ఇచ్చారు. దాని కోసం బాంగ్లాదేశ్ సెస్ పేరు తో లెవి విధించి 500 కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు, తీరా వచ్చిన ఫలితం భారత్ కి అనుకూలంగా లేదు. చికెన్ నెక్ ప్రాంతం పక్కన బాంగ్లాదేశ్ ప్రాంతాలు తీసుకోలేదు.

  6. 1971 యుద్ధలో గెలిచి కూడా, పాకిస్తాన్ కు అన్నీ అప్పచెప్పేసిన ఇందిరా గాంధీ, ఇది రాసిన దరిద్రుడికి వీరనారి

  7. ఇంకో 6 నెలలు లో బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది కర్ణాటక లో బీజం పడింది EVM హక్ చేశారు కరోనా టైం లో దోసుకున్న 40 వేలు కోట్లు బయట పెడుతాను అని బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్ చేశాడు 

  8. ఒకప్పుడు, ఇప్పుడు చాలా తేడా. చైనా పూర్తిగా పాక్ సపోర్ట్. బహుశా US కన్నా చైనా స్ట్రాంగ్ ఇప్పుడు. ఆఖరికి టారిఫ్ వార్ లో కూడా తగ్గేదెలా అన్నట్లు సాధించుకుంది. ఇక మోడీ ఇమేజ్ గత రెండేళ్లలో బాగా దెబ్బతింది. అంత నాటకీయంగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు చేసింది ముమ్మాటికి మంచిది. పేరు కోసం దేశాన్ని, జనాల్ని బలి ఇవ్వలేదు. చంద్రబాబు లాంటి experienced ఉన్నాక modi ఇక అలాంటి తప్పులు చేయడు.

    1. మన చంద్రం తాత సపోర్ట్ తో సెంట్రల్ గవర్నమెంట్ రన్ అవుతున్నా బీజేపీ నీ అడిగి రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు సాధించలేని సన్నాసులు దేశాన్ని మరియు యుద్ధాన్ని లీడ్ చేస్తారు అని నీలాంటి వాళ్లు భజన చేయడం అంటేనే అర్థం అవుతుంది మనం పచ్చ పార్టీ ఆస్థాన చెక్క భజన బ్యాచ్ అని.

  9. Burra petti alochinchatledhu ee article raasina vallevaro. Anti-modi janaalu rendu script lu ready cheskunaaru.

    War marintha mundhu ki velthe … “yuddham tho em saadhinchaaru. Money loss, life loss” ani.

    War aagipothe … “Dhammu ledhaa … Bayapaddaara” ani.

    Ee roju indira photos videos share chesina vallu, 4-5 days back de-escalate ani message chesina vaalle.

    POK, pakistan ivi kaadhu manaku kavalsindhi …. bayapetaam, revenge teerchukunaam. Mana strength ento trailer chupinchaam.

    Ika annee vadhilesi … mallee manam elaa develop avaaalo alochinchaali.

  10. Burra petti alochinchatledhu ee article raasina vallevaro.

    Ee roju indira photos videos share chesina vallu, 4-5 days back de-escalate ani message chesina vaalle.

    POK, pakistan ivi kaadhu manaku kavalsindhi …. bayapetaam, revenge teerchukunaam. Mana strength ento trailer chupinchaam.

    Ika annee vadhilesi … mallee manam elaa develop avaaalo alochinchaali.

  11. konni jaathula janaalu rendu script lu ready cheskunaaru.

    Ee roju indira photos videos share chesina vallu, 4-5 days back de-escalate ani message chesina vaalle.

    POK, pakistan ivi kaadhu manaku kavalsindhi …. bayapetaam, revenge teerchukunaam. Mana strength ento trailer chupinchaam.

    Ika annee vadhilesi … mallee manam elaa develop avaaalo alochinchaali.

  12. Ee roju indira photos videos share chesina vallalo chala mandhi, 4-5 days back de-escalate ani message chesina vaalle.

    POK, pakistan ivi kaadhu manaku kavalsindhi …. bayapetaam, revenge teerchukunaam. Mana strength ento trailer chupinchaam.

    Ika annee vadhilesi … mallee manam elaa develop avaaalo alochinchaali.

  13. మోడీ ఇమేజ్ చాలా పాడిపోయింది, జగన్ రెడ్డి ఇమేజ్ చాలా పెరిగి పోయింది టర్కీ , పాకిస్తాన్ లో. వచ్చే ఎలక్షన్స్ లో చేస్తే జగన్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించుకుంటామని ప్రజలు అంటున్నారు.

        1. Boss! Politics are not easy. Pawan said he would see the end of jagan and exactly said….. వంద అడుగుల్లో తొక్కేస్తాం అని. Exactly happened. Next time jaggu will be limited to zero seats. Just watch. He is unfit for politics. I can’t understand why he is staying in politics even after people thrown him out by giving him 11 seats. He should realise the ground reality. He is not required. Let him take rest.

    1. One one side you are shitting your pants daily and writing a comment or two about Jagan and on other side you are saying Jagan has no credibility in the state. Why are you so worried about Jagan if he has no credibility in the state?

  14. I think Chandrababu type experienced needed for the country. These bjp oldies are thinking is not good. Though Chandrababu is also senior, unlike others, his thoughts are always dynamic.

    1. Endi bro em maatlaadutunnav, manadi Tamilnadu kaadu, AP, ikkada manam Kulam to nidra lechi Kulam tini, taagi Kulam to padukuntaam, even cbn is capable of something you said, mana kula pichi valla nuvvu maatlaadindi paapame

  15. సరిహద్దులో సరిగ్గా shelling జరిగే చోట కూర్చోపెడితే తెలుస్తుంది. shells మీద పడకూడదు. కొంచెం అవతలగా చుట్టూరా పడాలి. 

  16. ఇక్కడ టాపిక్ పాకిస్థాన్ మీదనే తప్ప, మీ జ*గ#న#న్న మీద కాదు కదా, ఎందుకు కామెంట్స్ మోడరేట్ చేసుకోవడం ?

  17. Amid diplomatic failure, OS set backs, questionable security failure in Pahalgam and Pahalgam attacks murderers escape,  he should take moral responsibility and must resign ASAP.

  18. We all proudly stand behind and support our brave soldiers, our nation, our democracy. RSS credibility is at stake standing behind a miserably failed leader and asking to support him. Shame.

    1. World tours kottadu. Andaru naa friends annadu. Single fellow mundariki raaledu india ki support ga. Veedi diplomacy utter flop. As always with gujju products. Good marketing bad products.

    2. Made world tours. Said so many international friends i have. Finally not even one stood by in need. And now turned this problem into an international one which should not have been done. That is his diplomatic skills. Kootami utter flop on diplomacy and internal security.

  19. యుద్ధం భీకరంగా జరిగినది అనేది వాస్తవం, మన సైన్యం పాకిస్తాన్ నీ వణికించిన మాట కూడా వాస్తవం. రెండు దేశాలు సోషల్ మీడియాలో మాత్రం విజయ సంబరాలు చేసుకున్నారు.

    మనకు ఏమాత్రం నష్టం కాలేదు అని ఎందుకు బుకాయింపు , వాస్తవాలు బయట పెట్టటం వలన మన భవిష్యత్తు సరిదిద్దుకోవచ్చు.

    1.రఫెల్ పడగొట్టారు అని సాక్షాత్తు ఫ్రెంచ్ మీడియానే చెప్పింది, దాని స్టాక్ ప్రైస్ చాలా పడింది.

    2. చైనా వెపెన్స్ ఫెయిల్ అన్నారు, కానీ చైనా స్టాక్ మార్కెట్ లో వాటి వాల్యూ 40% పెరగటం వాటి సక్సెస్ చెపుతుంది.

    3. మన సైనికులు చనిపోయారు, పౌరులు కూడా పదుల సంఖ్యలో చనిపోయారు, మనకు నష్టం ఏమీ రాలేదు అని ఎలా అంటారు?

    4. పాకిస్తాన్ సాగిలపడితే, మన కండిషన్స్ ఎందుకు పెట్టలేదు, ఉగ్రవాదుల అప్పగింత డిమాండ్ లేదా ఒప్పందం ఎందుకు లేదు?

    5. ఉగ్రవాద మిగిలిన అడ్డలపైన ఎందుకు చర్యలు లేవు?

    6. భవిష్యత్తులో మళ్ళీ దాడి జరగదు అని ట్రంప్ హామీ ఇచ్చాడా?

    7. మనం అంత విజయంతో ముందుకెళ్తుంటే ఎవడో సంబంధం లేని గొట్టం గాడు మనల్ని కంట్రోల్ ఎలా చేశాడు?

    8. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇంటి సమస్యలతో ఉన్న పాకిస్తాన్ నీ, మనకు కూడా గతంలో లేనంత గట్టి అవకాశం వస్తె కూడా ఇలాంటి సమయంలో పాతాళానికి తొక్కే అవకాశం ఎందుకు వదిలేశారు?

    9. PoK మనకి రాదు, ఆ ప్రజలు మనతో కలవరు, బల ప్రయోగంతో తీసుకొన్నా మనకు తలనొప్పులు ఎక్కువ అవటం తప్ప ఉపయోగం లేదు అని తెలిసినా ఇంకా pok సాధిస్తాం అని ఎందుకు ఫేకటం ?

    10. బెలుచిస్తాన్ లో ఒక నక్సల్ టైప్ తిరుగుబాటు జరుగుతుంది, అదేదో పెద్ద దేశ విభజన అని… పాకిస్తాన్ అణు ఆయుధాలు పేల్చేశాం అని ప్రాపగాండా చేయటం కాకుండా, మన ఆర్థిక భవిష్యత్తు కోసం కొంచెం తగ్గాము అని నిజాయితీగా నిజాలు వివరిస్తే తప్పేమిటి?

  20. Perfect analysis but యుద్ధం అంటూ జరిగితే .. భారీగా ప్రాణనష్టం జరుగుతుంది. ఆస్తి నష్టం జరుగుతుంది. యుద్ధం ఎలాంటిదైనా వినాశనమే. అందులో విజేతలు సాంకేతికంగా ఉంటారు కానీ.. యుద్ధం చేసిన వారంతా నష్టపోతారు. దానికి తాజా సాక్ష్యం రష్యా, ఉక్రెయిన్ మాత్రమే..లక్షల మంది సైన్యాన్ని ఈ రెండు దేశాలు కోల్పోయాయి. పెద్ద ఎత్తున ప్రజల్ని ఇబ్బందులు పట్టారు. ఉక్రెయిన్ దాదాపుగా నాశనం అయిపోయింది. రష్యా పెద్ద ఎత్తున సైనిక, ఆర్థిక నష్టాలను చవి చూసింది. ఇప్పటికీ అనుకున్న విజయాన్ని పొందలేకపోయింది. రేపు రష్యా విజయం సాధించినట్లుగా ప్రకటించుకోవచ్చు కానీ.. జరిగిన నష్టాన్ని మాత్రం ఎప్పటికీ భర్తీ చేసుకోలేదు. సగటు భారతీయునిగా అలాంటి విజేతగా భారత్ ఉండాలని కోరుకోలేం.పాకిస్తాన్ ఖచ్చితంగా పాపిస్తాన్ . ఆ విషయంలో మరో డౌట్ లేదు. ఆ దేశంలో సానుభూతి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ దేశాన్ని బలహీనం చేయాలి. 

    1. It increased by 10 points but decreased only by 3 points sir. What Modi and India did is good enough. It gave a message to Pakistan and the world. US, and even China also didn’t support Pakistan openly and tried to pacify both leaders. Israel and Russia are in our support and Turkiye supported Pak. Pakistan lost water, business and aviation because of their enemity with us. Let’s see if they will try to change their ways. 

  21. ఇందిర పాలన సమయంలో ఏ దేశం మరో దేశం మీద ఆధారపడేది కాదు ఇప్పటిలా, అదీ కాక భారత్ పాకిస్తాన్ అణు స్థావరం వద్ద చేసిన దాడి వల్ల అణు ధార్మిక త వ్యాపించే ప్రమాదం వల్ల అమెరికా చెబితే ఆపాల్సి వచ్చింది.

  22. రష్యా, అమెరికా లు afgan ని పదేళ్ల చొప్పున చేతిలో పెట్టుకుని ఎంత ప్రయత్నం చేసినా చివరికి ఫలితం లేదు కదా, వాళ్లే చెయ్యలేనిది భారత్ పాకిస్తాన్ విషయం లో చెయ్యగలదా?

  23. ఏదేదో చేసి పాకిస్తాన్ లో మార్పు తేవడం జరిగే పనేనా? ఒక్కసారి మన దేశం లో ఉన్న ఆ వర్గం ప్రజల ప్రవర్తన చూడండి!

    1. Muslims in our country are okay sir. I am proud of Kalaam, Shami, Sofia Qureshi, Nikhat Jareen and Shah Rukh Khan. But Pakistan can’t be changed easily because people there are controlled by ISI and terror groups. Illiteracy is very high there and it is better for muslims in India.

  24. Other than war, Modi also stopped Indus water treaty which will affect Pakistan a lot. Their agriculture will be really affected. India gave water to Pak only because we have humanity. Modi is also humane but he wanted to be hard on them this time. India also stopped trade with Pakistan, stopped visas to them and closed airways to them. They did the same which won’t affect us so much. They will lose 2-3% of their international trade and we will lose only a .2% or less if trade is stopped on both sides. Modi agreed for ceasefire because many innocent civilians will die on both sides if it continues. We have upper hand if we can hold water to them, which is being done.

    1. Reality is stopping indus treaty will not have any impact at the moment unless India build a few new projects to store water on our side. It takes ages to build any project. All media hype nothing else. We are not able to influence international community and stop IMF funds. We are unable to control western media claiming Pakistan victory. Except in Indian media and a very few western, no one is claiming India’s dominance . Sorry but it’s the current reality.  We need to see the next diplomatic steps by our government. If you tell something to public repeatedly , public will start believing it as truth. This is what media is doing. We don’t need to prove ourselves but international community must feel our strength and stamina to get respect. Ceasefire is good as it saves a lot of lives. However, we should not allow Pakistan to claim victory as it helps them to bring  more innocents to terrorism. In my opinion, we won the war but lost the purpose. It is just my opinion 

  25. మోడీకి దేశ ప్రజలు వారి భద్రత ముఖ్యమా ఎన్నికలు సీట్లు గెలుపు ఇవే కావాల, చాలా తప్పు పాకిస్తాన్ పని పడితేనే మన రాబోయే తరాలు హాయిగా ఉంటాయి ఎక్కడికి వెళ్తే ఏ ఉగ్రవాది చంపాతాడో అని భయపడి బతికే రోజులు అవసరమా 3 సార్లు ప్రధాని అయ్యారు ఇంకే ఏం కావాలి సీట్లు వోట్లు కాదు భారత ప్రజల ప్రాణ రక్షణ కావాలి 

  26. అసలు ఆ దేశాల్లో వాళ్ళు టెర్రరిస్టు లుగా మారడానికి కారణం అయిన ఆ పుస్తకం పేరు కూడా చెప్పే దమ్ము లేనప్పుడు ఈ నీతి సూత్రాలు ఎందుకు? 

  27. Ante tama సైకో కాంగ్రెస్ గూటికి చేరే పని స్టార్ట్ చేసారు 

  28. పాక్ ఆక్రమిత కాశ్మీర్  భారత్ అధీనం లోకి రావాలి…ఐ ఎస్ ఐ ముఖ్య నాయకులని భారత్ కి అప్పగించాలి..ఇప్పుడు….ఇవే భారత్ ముందున్న లక్ష్యాలు…..

  29. ఇంట్లో కూర్చుని యుద్ధం చేయాలని చెప్పటం చాలా ఈజీ..

    బోర్డర్ కి వెళ్ళి చూడండి..ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో..

    ఆల్రెడీ మన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికే రుజువు చేశాం..పాక్ ఎయిర్ bases నాశనం చేశాం.. కాళ్ళు పట్టుకునేలా చేశాం.. అజర్ మసూద్ ఏడ్చేలా చేశాం..

    పైగా ప్రపంచ దేశాలన్నీ మనకే సపోర్ట్ వచ్చేలా ఉంది పరిస్థితి..

    ఇన్ని సాధించటం లో మన జవాన్లు వీర మరణం చెందారు.. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది.. విజయాల్ని చూసి మరింత రెచ్చిపోయి ఇంకా ఆస్తి నష్టం ప్రాణ నష్టం కోరుకుంటామా.. లేక తగిన గుణ పాఠం చెప్పాం కాబట్టి యుద్ధ నీతి ప్రకారం కాల్పులు విరమించి మన సైన్యానికి ఊరట ఇస్తామా అని..

    ఇప్పుడు యుద్ధం చేయాలని చెప్పే వాళ్లంతా సోషల్ మీడియా జవాన్లు మాత్రమే.. తీసుకెళ్లి బోర్డర్ లో పడేస్తే వాళ్ళు పోసే దానికి బకెట్లు ట్యాంక్ లు కూడా సరిపోవు..

    సరైన టైమ్ కి ఎటాక్ చేశాం.. అనుకున్నది సాధించాం.. సరైన టైమ్ కి విరమించాం..

Comments are closed.