తెలంగాణ రాజకీయలు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. గత వారం కేంద్ర హొం మంత్రి అమిత్ షా ప్రముఖ హీరో ఎన్టీఆర్ తో లంచ్ మీటింగ్ తరువాత మరో బీజేపీ కీలక నేత మరో టాలీవుడ్ హీరోతో మీటింగ్ కాబోతున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఆగష్టు 27న సాయంత్రం హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గోనున్నారు.
బహిరంగ సభకు హజరు కాబోతున్న జేపి నడ్డా శనివారం సాయంత్రం హైదారాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో తెలుగు రాష్ట్రలకు చెందిన సినీ ప్రముఖులు, క్రీడాకారులను అహ్వానించినట్లు తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ హీరో నితిన్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతేక్యంగా భేటి కానున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటి ను రాజకీయ వర్గాలు ప్రత్యేకంగా చూస్తున్నారు. బీజేపీ వారు ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేకుండా కలవరు అనేది వారి నుండి వస్తున్నా మాటలే కాదా. ముందు ముందు తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా ఉండబోతుంది.