ఉన్నట్లుండి ట్విట్టర్ కాస్తా..ఆంటీ..ఆంటీ అంటూ గోల పెడుతోంది. ఎక్కడెక్కడి వీడియోల మీద ‘ఆంటీ..ఆంటీ’ అనే ఓవర్ లాప్ వాయిస్ లు వినిపిస్తున్నాయి.
ఇదంతా నటి అనసూయ భరద్వాజ్ ను ట్రోల్ చేసే కార్యక్రమం తప్ప వేరు కాదు. నిన్నటికి నిన్న ఎవరి పేరు ప్రస్తావించకుండా, ఏ సినిమా పేరు చెప్పకుండా ఓ సెటైరికల్ ట్వీట్ వేసారు అనసూయ. అక్కడ నుంచి ప్రారంభమైంది రగడ.
ఈ రగడలో ఆంటీ అన్న పదం రామాయణంలో పిడకలవేటగా మారింది. ఆంటీ..ఆంటీ అంటూ తనను ఏజ్ షేమింగ్ చేస్తే చర్య తీసుకుంటా అని అనసూయ అనడంతో మరింత రెచ్చిపోయారు నెటిజన్లు. నిన్నటి నుంచి అనసూయకు ఆమె యాంటీ..ఆంటీ ఫ్యాన్స్ కు మధ్య ట్వీట్ ల వార్ నడుస్తూనే వుంది. ఈ మధ్యలో దూరిన శ్రద్దాదాస్ ను కూడా ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు.
నిజానికి నిన్నటికి నిన్న అనసూయ ట్వీట్ పెట్టిన తరువాత అలా వదిలేసి వుంటే సరిపోయేది. లేదా తనను ట్రొల్ చేసిన వారిని బ్లాక్ చేసుకున్నా పోయేది. అలా కాకుండా వ్యవహారం ‘ఆంటీ’ వైపు మళ్లడంతో ట్విట్టర్ బ్యాచ్ హడావుడికి హద్దులేకుండా పోయింది.
నిజానికి వాళ్ల శోధనకు హ్యాట్సాప్. ఎక్కడెక్కడి వీడియోలో తీసి షేర్ చేస్తున్నారు. వాటిల్లో అనసూయ చేసిన వీడియోలు కూడా వుండడం మరీ స్పెషల్. మొత్తానికి ట్విట్టర్ లో ఈ రోజు హడావుడి ఏమిటంటే ఇదే.