తెలంగాణ గవర్నర్ గా పదవి ,చేపట్టి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన దానికి గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు ట్విట్టర్ వేదికగా కవిత సీరియస్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను అపఖ్యాతి పాలు చేయడానికి, గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చుకున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
తప్పుడు ప్రకటనలతో తెలంగాణ ప్రజల మన్ననలను పొందలేరని గ్రహించిన బీజేపీ నేతలు, గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు చేపిస్తున్నారంటూ మండి పడ్డారు.
గత కొద్ది కాలంగా బీజేపీ- టీఆర్ఎస్ రాజకీయ వైర్యం కాస్తా తెలంగాణ ప్రభుత్వం- గవర్నర్ మధ్య వైర్యంలాగా తయారైంది. ఈ రోజు గరవ్నర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మొత్తం రాజకీయ దుమారం లేపింది.