కేసీఆర్ గాంధీ మహాత్ముడా?

సాధారణంగా రాజకీయ నాయకులు తాము గొప్ప నిజాయితీపరులమన్నట్లు మాట్లాడతారు. తాము జీవితంలో తప్పు చేయలేదని, చేయబోమని అంటారు. కానీ ప్రపంచంలో తప్పులు చేయని మనిషి ఉంటాడా? కొంతమంది తెలిసి తప్పులు చేస్తారు. కొందరు తెలియక…

సాధారణంగా రాజకీయ నాయకులు తాము గొప్ప నిజాయితీపరులమన్నట్లు మాట్లాడతారు. తాము జీవితంలో తప్పు చేయలేదని, చేయబోమని అంటారు. కానీ ప్రపంచంలో తప్పులు చేయని మనిషి ఉంటాడా? కొంతమంది తెలిసి తప్పులు చేస్తారు. కొందరు తెలియక చేస్తారు.

రాజకీయ నాయకులైతే తెలిసే, ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేస్తారు. అసలు రాజకీయాల్లోకి రాగానే ఒకవిధమైన పొగరు వస్తుంది. తాము ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటారు. ఇక అధికారంలో ఉన్నవారి సంగతి చెప్పక్కరలేదు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఐదున్నర నెలలపాటు జైల్లో ఉండి, బెయిల్ మీద విడుదలైన కవిత తనను జైలుకు పంపిన వాళ్ళ అంతు చూస్తానన్నట్లుగా మాట్లాడింది. తమకూ సమయం వస్తుందని, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పింది. “నేను కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు” అని అన్నది.

అంటే… తాము శుద్ధ పూసలమన్నట్లు మాట్లాడింది. కేసీఆర్ మీద, కవితతో సహా ఇతర ఫ్యామిలీ మెంబర్స్ మీద బొచ్చెడు ఆరోపణలు ఉన్నాయి. అవి వాస్తవమా? అవాస్తవమా? అనేది పక్కన పెడితే రాజకీయ నాయకుల ఆస్తులు ఏడాదికేడాది ఎలా పెరుగుతాయి? ఏ అవినీతి చేయకపోతే అంతలా ఆస్తులు ఎలా వస్తాయి? ఒకప్పటి రాజకీయ నాయకులు ఉన్న ఆస్తులు కరిగించుకున్నారు. ఇప్పటి పోటీషియన్స్ అందుకు భిన్నం.

కవిత తప్పు చేసిందా? చేయలేదా? అనేది కోర్టు ఇంకా తేల్చలేదు. తప్పు చేయలేదని తాను చెప్పుకుంటోంది. కానీ కోర్టు ఇంకా తేల్చలేదు కదా. తాను కేసీఆర్ బిడ్డను అని తప్పు చేయనని చెప్పడంలో తమది సత్యహరిచంద్రుల ఫ్యామిలీ అన్నట్లుగా మాట్లాడింది.

కేసీఆర్ ఏమీ గాంధీ మహాత్ముడు కాడు కదా. ఒకవేళ ఆయన గాంధీయే అనుకుందాం. కానీ కవిత అలా అవ్వాలని లేదు కదా. తల్లిదండ్రుల్లా వాళ్ళ వారసులు ఉండాలని ఏముంది? అసలు తండ్రి తెలంగాణ ఉద్యమం ప్రారంభించగానే, పార్టీ పెట్టగానే కేటీఆర్, కవిత అమెరికా నుంచి హడావుడిగా హైదరాబాదుకు ఎందుకు వచ్చినట్లు? ఏదో ఆశించే కదా వచ్చారు? కాబట్టి తాను నిప్పులాంటి మనిషినని కవిత చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది.

12 Replies to “కేసీఆర్ గాంధీ మహాత్ముడా?”

  1. కేసీఆర్ మహాత్ముడూ కాదు వైఎస్ఆర్ మహానేత కూడా కాదు. అవినీతి జలగలు, కొడుకు కూతుళ్ళకు అడ్డంగా దోచిపెట్టిన అక్రమార్కులు

  2. 40 వెల కొట్లు అవినితి అరొపణలు ఎదుర్కొన్న జగన్ arrest అయిన రొజు నుండి సానుబూతి వచ్హింది ..ఎకంగా CM అయ్యాడు

    మీకు అదికారం పొయినా ..మహిళ అయిన నువ్వు JAIL కు వెళ్ళినా తర్వాత కూడ నీ మీద సానుబూతి రావట్లెదు ఎందుకంటావ్ ..

    పైగా మహిళలు కూడా నిన్ను దెకట్లెదు

  3. 40 వెల కొట్లు అవినితి అరొపణలు ఎదుర్కొన్న జగన్ arrest అయిన రొజు నుండి సానుబూతి వచ్హింది ..ఎకంగా CM అయ్యాడు

    మీకు అదికారం పొయినా ..మహిళ అయిన నువ్వు JAIL కు వెళ్ళినా తర్వాత కూడ నీ మీద సానుబూతి రావట్లెదు ఎందుకంటావ్ ..

  4. 40 వెల కొట్లు అవినితి అరొపణలు ఎదుర్కొన్న జగన్ A R R E S T అయిన రొజు నుండి సానుబూతి వచ్హింది ..ఎకంగా CM అయ్యాడు

    మీకు అదికారం పొయినా ..మ హి ళ అయిన నువ్వు JAIL కు వెళ్ళినా తర్వాత కూడ నీ మీ ద సానుబూతి రావట్లెదు ఎందుకంటావ్ ..

  5. 40 వెల కొట్లు అ.. వి ..ని .. తి అరొపణలు ఎదుర్కొన్న జగన్ A R R E S T అయిన రొజు నుండి సానుబూతి వచ్హింది ..ఎకంగా CM అయ్యాడు

    మీకు అదికారం పొయినా ..మ హి ళ అయిన నువ్వు JAIL కు వెళ్ళినా తర్వాత కూడ నీ మీ ద సానుబూతి రావట్లెదు ఎందుకంటావ్ ..

  6. //వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పింది//

    తిన్నది వడ్డీతో సహా చెల్లించు.

  7. తల్వతుంట్ల తవితతు bailx 

    తనను కలవడానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కేఆర్‌ సురేష్‌రెడ్డిలను  ఆమె ఓదార్చారు.

    “అయిదున్నర నెలల తర్వాత మీ ఓటమి ముఖాలను చూడటం చాలా boring గా ఉంది. నా కుటుంబాన్ని ఇటువంటి ఇబ్బందుల పాలు చేసిన రేవంత్ మరియు congress మీద బదులు తీర్చుకుంటాము.”

  8. జిఏ కు అన్నీ వింతలే. జగన్ ప్రజల తల మీద చేతులు పెట్టి దీవించి ప్రభువు లాగా ఫీల్ అవుతుంటే, కెసిఆర్ గాంధీ మహాత్ముడు అనుకోవటం లో ఏంటి తప్పు? జగన్ సజ్జలను పెట్టుకున్నట్టు, జీఏ ఎంబీస్ ప్రసాద్ ను పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. అయినా ఆ జగన్ అంత వెర్రోడు కాక పోతే, ఆ దీవించటాలేంటో?

  9. Ee vishayamlo mimmulni abhinañdistunna..yes meeru cheppindi 100% nijam .kcr vadu family puttinde dochukodaniki..adhi Telangana udyamam kadu nundi Anni vallaki suvarna avakasham la labhinchi pratyeka rastramga avatarinchi chivaraku 10 years cm ga chesi Anni vargala varini mosaginchi neeti projectlanu addam pettukoni kutumbham lo prathi okkadu Thatha kcr nundi manuvallu Mañavarallu meñalkudu vadi kutumbhamm. Añttha gade kinda pandikokkula madiri dorikindAntha doçhukoni thini Baga balisi kovvekki kottukuntunnaru

Comments are closed.