తెలంగాణలో హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విద్యా సంస్థల కూల్చివేత కూడా ప్రస్తావనకు వచ్చింది.
మరోవైపు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి విద్యా సంస్థల కూల్చివేత వంతు వచ్చినట్టుంది. ఇందులో భాగంగా రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీటితో పాటు మర్రికి చెందిన దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ నోటీసులు అందాయి.
చిన్నదామరచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు అక్రమమంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇవ్వాలని కోరారు. మొత్తం 8 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టినట్టు రెవెన్యూ అధికారులు నోటీసుల్లో ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖరరెడ్డి విద్యా సంస్థల కూల్చివేత తప్పదని అంతా భావిస్తున్నారు.
ఈయన మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు. గతంలో రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష హోదాలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రికి సంబంధించిన ఆస్తులపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వాళ్ల అక్రమ నిర్మాణాల కూల్చివేత తప్పదనే చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి మనసెరిగి హైడ్రా వ్యవహరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
vc estanu 9380537747
Call boy jobs available 8341510897