దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు. దీంతో సమయం దాటినా కవితను ఈడీ అధికారులు బయటకు పంపకపోవడంతో. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. తర్వాత కొద్ది సేపులోనే కవిత విచారణ ముగించుకోని బయటికి వచ్చారు.
కాగా ఈడీ జాయిండ్ డైరక్టర్ నేతృత్వంలో ఐదుగురు అధికారుల ప్రత్యేక బృందం ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభించగా.. 9 గంటల పాటు ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
తొమ్మిది గంటల సుదీర్ఘ ఈడీ విచారణ అనంతరం బయటికి వచ్చిన కవిత కార్యాలయం బయట వేచి చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు నవ్వుతూ అభివాదం చేశారు. కవితను మాట్లాడాలంటూ మీడియా అడిగినా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు.