కవిత ఎజెండానే సోనియా ఫాలో కావాలా?

‘‘ఇన్నేళ్లుగా ఆ వ్యవహారం ఎలా మంటగలిసిపోయిందనే సంగతి నేను ఎన్నడూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం నేనొక ఎజెండాను భుజానికెత్తుకున్నాను. కాబట్టి ప్రపంచం మొత్తం నా ఎజెండానే ఫాలో…

‘‘ఇన్నేళ్లుగా ఆ వ్యవహారం ఎలా మంటగలిసిపోయిందనే సంగతి నేను ఎన్నడూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం నేనొక ఎజెండాను భుజానికెత్తుకున్నాను. కాబట్టి ప్రపంచం మొత్తం నా ఎజెండానే ఫాలో కావాలి.. ’’ అని ఎవ్వరైనా డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైఖరి అచ్చం అలాగే ఉంది. 

ఆమె తొమ్మిదేళ్లపాటూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ గురించి ఆమె పోరాటం ఎత్తుకున్నారు. ఇప్పుడు తాను మేలుకున్నాను కాబట్టి.. తన మేలుకొలుపు పాటకు దేశంలోని నాయకులందరూ వంత పాడాలని ఆమె కోరుకోవడం వింతగా ఉంది.

పార్లమెంటు అయిదు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కావడానికి కేంద్రం నిర్ణయించిన తర్వాత.. ఇప్పుడు రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇండియా పేరును భారత్ గా మార్చడం, జమిలి ఎన్నికల ప్రతిపాదనను బిల్లుగా ప్రవేశపెట్టడం, యూసీసీ బిల్లు లాంటివి సభ ముందుకు రావచ్చునని అనేక ఊహాగానాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. 

కేంద్రం నిర్దిష్టంగా సభల ఎజెండా ఫలానా అని ప్రకటించకపోవడం వల్ల ఇలా జరుగుతోంది. కాగా, సమావేశాల్లో ఈ తొమ్మిది అంశాలు ఉండాలంటూ.. మణిపూర్ అల్లర్ల గురించి, అదానీ వ్యాపారాలు, రైతుల సమస్యలు, చైనా దురాక్రమణలు వంటివన్నీ సభలో చర్చకు రావాలని సోనియా గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు.

అజెండా ప్రకటించకుండా పిలుపు ఇచ్చిన పార్లమెంటు సమావేశాలు గనుక.. దీనిని రాజకీయం చేయడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. తాము మోడీ చాలీసా పఠించడానికి సిద్ధంగా లేం అని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. సోనియా కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. ఈ నేపథ్యంలో  కవిత రంగంలోకి వచ్చారు. ఈ సమావేశాల్లో మహిళాబిల్లును ఆమోదించేలా చేయాలి.. అనే తన పాట ఎత్తుకున్నారు. సోనియా, ప్రధాని మోడీకి రాసిన లేఖలోని 9 అంశాల్లో మహిళాబిల్లు ఎందుకు లేదని, అది ముఖ్యమైనదిగా ఆమెకు కనిపించడం లేదా? అని కవిత ప్రశ్నిస్తున్నారు. 

తన తండ్రి తెలంగాణ తొలి కేబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వకపోయినా, రెండో కేబినెట్లో కేవలం ఇద్దరికే చోటు కల్పించినా.. నోరు మెదపని కవిత అవే విమర్శలను మోడీ సర్కారు మీద చేస్తుండడం విశేషం. 

కేసీఆర్ తాజాగా ఎన్నికల బరిలోకి కేవలం ఆరుశాతం మహిళలకు మాత్రమే టికెట్ ఇచ్చినప్పటికీ.. ఆయన కూతురు చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం పేరుతో ప్రహసనం నడిపిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. పైగా.. తన ఎజెండాను సోనియా సహా దేశమంతా ఫాలో కావాలని ఆమె కోరుకోడం చిత్రంగా ఉన్నదని కూడా ప్రజలు అంటున్నారు.