ఏయూలో పట్టాల పండుగ… ఇనాక్ కి గౌరవ డాక్టరేట్

ప్రతిష్టాత్మకమైన విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ మరో రికార్డుని క్రియేట్ చేస్తోంది. నాలుగేళ్ల స్నాతకోత్సవాలను కలిపి ఒకేసారి జరుపుతోంది. 87, 88, 89, 90 నాలుగు సంవత్సరాలకు సంబంధించి సంయుక్త స్నాతకోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.…

ప్రతిష్టాత్మకమైన విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ మరో రికార్డుని క్రియేట్ చేస్తోంది. నాలుగేళ్ల స్నాతకోత్సవాలను కలిపి ఒకేసారి జరుపుతోంది. 87, 88, 89, 90 నాలుగు సంవత్సరాలకు సంబంధించి సంయుక్త స్నాతకోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ప్రతీ ఏటా ఘనంగా జరిపించాల్సిన ఉండగా  2017 నుంచి ఏయూలో స్నాతకోత్సవాలు ఆగిపోయాయి. ఆ తరువాత కరోనా వల్ల మరో మూడేళ్ళ పాటు ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో ఒక్కసారి పట్టాల పండుగతో ఏయూలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ నాలుగేళ్ళలో పీ హెచ్ డీ చేసిన వారికి పట్టాలతో పాటు వందలాది పట్టాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రధానం చేస్తున్నారు.

వేలాది మందికి పట్టాలు గవర్నర్ చేతుల మీదుగా అందనున్నాయి. దాదాపుగా 1500 మందికి డాక్టరేట్ పట్టాలు అందిస్తారు. ఈ నెల 9న మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమం ఏయూ వేదికగా జరగనుంది. ప్రముఖ తెలుగు రచయిత కొలకలూరి ఇనాక్ కి గౌరవ డాక్టరేట్ పట్టాను అందించడం విశేషంగా ఉంది.  

1926లో ఏయూ ఆవిర్భవించింది.  మరో మూడేళ్లలో ఏయూ వందేళ్ళ పండుగను చేసుకోబోతోంది.శతాబ్ది ఉత్సవాలకు సైతం ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.