తండ్రి సభలు.. కూతురు పాదయాత్ర !

కేసీఆర్, ఆయన కూతురు కవిత చాలా కాలంగా జనంలో లేరు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత, తాను ద్వేషించే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రధానంగా తనకు శత్రువు, తాను జైలుకు పంపిన రేవంత్…

కేసీఆర్, ఆయన కూతురు కవిత చాలా కాలంగా జనంలో లేరు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత, తాను ద్వేషించే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రధానంగా తనకు శత్రువు, తాను జైలుకు పంపిన రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత కేసీఆర్ జనంలోకి రావడం మానేశాడు. ఓడిపోయిన కొత్తలో ఏదో హడావుడి చేశాడుగాని ఆ తరువాత ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యాడు.

ఇక కవిత ఐదున్నర నెలలుగా జైలుకే పరిమితం అయ్యింది. ఆమె జెల్లో ఉండగానే అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారిపోయింది. గులాబీ పార్టీ నుంచి చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. తండ్రి, కూతురు ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఏమిటది? లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాంట్లో సత్తా చూపించాలని కేసీఆర్ డిసైడ్ చేసుకున్నాడట. రైతులందరికీ రుణమాఫీ కాలేదని, ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వలేదని, కాబట్టి రైతుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని భావిస్తున్న కేసీఆర్ దాన్ని జనంలోకి తీసుకుపోవాలనుకుంటున్నాడు.

ఆల్రెడీ కొడుకు అండ్ మేనల్లుడు సర్కారు మీద విమర్శలు చేస్తున్నా అది చాలదని, తాను రంగంలోకి దిగితే సీన్ మారుతుందని అనుకుంటున్నాడట. రేవంత్ ప్రభుత్వం మీద విరుచుకుపడాలని అనుకుంటున్నాడట. అందులోనూ ఇప్పుడు కొత్తగా హైడ్రా విజృంభిస్తోంది.

అక్రమ నిర్మాణాల్లో చాలావరకు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయనే ఆరోపణులు ఉన్నాయి. అందులోనూ గులాబీ పార్టీ నాయకులను రేవంత్ టార్గెట్ చేసుకున్నాడని అంటున్నారు. ఇదంతా జనం ముందు పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నాడట.

మొత్తం మీద చెప్పాలంటే ప్రభుత్వాన్ని, రేవంత్ ను కడిగి పారేయడానికి, ఉతికి ఆరేయడానికి కేసీఆర్ సభలు పెడతాడట. మొదటి సభ సీఎం నియోజకవర్గమైన కొడంగల్ లోనే పెడతాడని సమాచారం. ఇక కూతురు కవిత రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుందని సమాచారం. తాను ఏ తప్పు చేయకపోయినా, అన్యాయంగా జైలులో పెట్టి వేధించారని ప్రజలకు చెప్పుకుంటుందట.

తను జనంలోకి రాకపోతే వారికి తప్పుడు సంకేతం వెళుతుందని భావిస్తోంది. పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పం కూడా ఉందని తెలుస్తోంది. ఇందుకు పాదయాత్రే మార్గమని ఆనుకుంటోందట. తండ్రి కూతుళ్ళ కార్యక్రమాలు త్వరలో మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఒకేసారి జరుగుతాయా ? వేరువేరుగా జరుగుతాయా? తెలియదు.

8 Replies to “తండ్రి సభలు.. కూతురు పాదయాత్ర !”

  1. కడుపు చించుకొంటే కాళ్ళమీద పడినట్టు, అనవసరంగా కెలుక్కొంటే ఆ మహాతల్లి చేసిన స్కాం ఊళ్లలో కూడా ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్టు అర్థం అవుతుంది, అపుడు ఉన్న పరువు కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరదలో కొట్టుకుపోవడం ఖాయం

  2. బాబు గ్రేట్ ఆంధ్ర ఆమె జైల్ లో ఉన్నప్పుడు తెలంగాణలో అయ్యింది పార్లమెంటు ఎలక్షన్స్ మాత్రమే అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 డిసెంబర్లో నే అయిపోయాయి.

  3. మేధావి గారు ఆమె జై ల్లో ఉన్నప్పుడు అయ్యింది తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ పోయిన సంవత్సరమే అయిపోయాయి

Comments are closed.