సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై తన కామెంట్స్‌ను వక్రీకరించారని ఆయన పేర్కొనడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడంపై రేవంత్ రాజకీయంగా స్పందించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఇదే కేసులో బెయిల్ రాలేదని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే కవితకు బెయిల్ వచ్చినట్టు రేవంత్ అన్నారనే వార్తలొచ్చాయి. రేవంత్‌పై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది.
ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలనే పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల్లోకి న్యాయస్థానాన్ని ఎందుకు లాగుతున్నారని రేవంత్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ పార్టీలను సంప్రదించి బెయిల్ ఇవ్వాలా? అని ధర్మాసనం నిలదీసింది.
కవితకు బెయిల్‌పై రేవంత్ కామెంట్స్‌ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. బాధ్యతాయుతమైన సీఎం చేయాల్సిన కామెంట్సా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. “న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన గౌరవం వుంది. పూర్తి విశ్వాసం ఉంది. నా కామెంట్స్‌ను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టే ఉద్దేశం నాకు లేదు. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ వ్యక్తం చేస్తున్నా. తప్పుడు కామెంట్స్‌ను నాకు అంటకట్టడం సరైంది కాదు” అని ఆయన పోస్టు పెట్టారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించడం విశేషం. సుప్రీం దెబ్బతో రేవంత్‌రెడ్డి దిగొచ్చారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
idendi .. supreme ni evaru emi anakudadu ante abhiprayanni yela cheppukovali.
రేవంత్ ని దొబ్బులు పెట్టారు, మిమ్మల్ని, ఆంధ్రజ్యోతి బాధా కృష్ణ ని ఓ నెల రోజులు లోపల వేస్తే తెలిసి వస్తుంది, అన్నిటికి వ్యవస్థ మేనేజ్ అనకుండా!
vc estanu 9380537747
Call boy jobs available 8341510897
ఇదే విషయము మీద బండి సంజయ్ కూడా ఆరోపణలు చేసాడు కేంద్ర మంత్రి పదవుల్లో ఉంది .. మరి అతని మీద ఎందుకు ఆగ్రహించలేదో “సుప్రీం “?