తమరు అధిష్ఠానానికి ఏమిస్తున్నారు కిషన్!

‘‘నేను పార్టీని ఎప్పుడూ ఏమీ అడగలేదు.. అధిష్ఠానమే గుర్తించి అన్నీ ఇస్తోంది. నాకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తిస్తున్నా’’ అని కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి కొత్త సారథి కిషన్ రెడ్డి అంటున్నారు. Advertisement…

‘‘నేను పార్టీని ఎప్పుడూ ఏమీ అడగలేదు.. అధిష్ఠానమే గుర్తించి అన్నీ ఇస్తోంది. నాకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తిస్తున్నా’’ అని కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి కొత్త సారథి కిషన్ రెడ్డి అంటున్నారు.

సారథ్యం స్వీకరించిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. గతంలో కూడా పార్టీసారథ్యం వహించిన అనుభవం ఉన్నకిషన్ రెడ్డి.. ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రి పదవులు నిర్వహించారు. వీటిపట్ల ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపదవినీ తాను ఆశించలేదని.. అన్నీ వరించి వచ్చాయని ఆయన అంటున్నారు. 

ఇంతకూ ఇప్పుడు ప్రజల మదిలో ఒక సందేహం మెదలుతోంది. కిషన్ ఏమీ అడక్కపోయినా.. ఆయనకు వరుసగా పదవులు కట్టబెడుతూ వచ్చిన పార్టీకి ఆయన రిటర్న్ గిఫ్ట్గ్ గా  ఏమివ్వబోతున్నారు?

ఇది ఇప్పుడు చాలా కీలకం. ఆయన చెబుతున్న ప్రకారమే.. ఆయన అడగకుండానే.. ఆయనకు పార్టీ చాలా ఇచ్చిందని అంటున్నారు. మంచిదే.. మరి తెలంగాణలో తాము సొంతంగా అధికారంలోకి రాగలం.. అనే నమ్మకం చిక్కబడేంత సీరియస్ గా పార్టీ బలపడిన నేపథ్యంలో..  కిషన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సింహాసనాన్ని పార్టీకి అందించే పూనిక తీసుకుంటారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. 

కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న తీరును గమనిస్తే.. బిజెపి ఈ దఫా అధికారంలోకి రావడం గురించి ఆశలు వదలుకోవచ్చుననే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. కాంగ్రెస్ పట్ల చాలా మంది నాయకులు మొగ్గుచూపుతున్న వాతావరణంకనిపిస్తోంది. అధికార భారాస నుంచి కూడా అక్కడ పొసగక పక్కచూపులు చూస్తున్న వాళ్లంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు తప్ప.. ఇప్పటిదాకా బిజెపి వైపు చూస్తున్న దాఖలాలు లేవు.

ఇలాంటి నేపథ్యంలో పార్టీకి తనకు ఇచ్చిన కానుకల ముచ్చట్లు పంచుకోవడం మాత్రమే కాదు.. కిషన్ రెడ్డి.. తాను పార్టీకి కానుకగా ఏం ఇవ్వదలచుకున్నారో.. అందుకు సంబంధించిన ప్రణాళిక ఏమిటో కూడా మీడియాతో చెప్పి ఉంటే బాగుండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

నిజానికి కిషన్ రెడ్డి ఎదుట పార్టీని గద్దెమీదకు తీసుకురావడం అనేది చాలా క్లిష్టమైన సవాలు. ఇన్నాళ్లూ పార్టీకోసం పనిచేసిన, కేసీఆర్ మీద ఒంటికాలితో ఫైర్ అవుతూ రెచ్చిపోయిన బండి సంజయ్ ను ఇప్పుడు చాలా స్పష్టంగా పక్కన పెట్టారన్నట్టుగా సంకేతాలు వెళుతున్నాయి. ఆయనను కూడా కలుపుకుని పోతూ.. పార్టీ సమైక్యంగా ఉన్నదనే సంకేతాలు ఇస్తే తప్ప.. కిషన్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కష్టం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.