నేను రాను.. రాలేను!

ఎన్నిక‌లు ఉన్న‌ప్పుడు అన్ని రాజ‌కీయ పార్టీ ఎలా విజ‌యం సాధించాలో అలోచిస్తూంటాయి కానీ కాంగ్రెస్ లో మాత్రం.. పార్టీ విజ‌యం కోసం కాకుండా ఒక‌రిపై ఒక‌రు నిందాలు వేసుకుంటూ ప‌క్క పార్టీ వారికి ఆవ‌కాశ‌లు…

ఎన్నిక‌లు ఉన్న‌ప్పుడు అన్ని రాజ‌కీయ పార్టీ ఎలా విజ‌యం సాధించాలో అలోచిస్తూంటాయి కానీ కాంగ్రెస్ లో మాత్రం.. పార్టీ విజ‌యం కోసం కాకుండా ఒక‌రిపై ఒక‌రు నిందాలు వేసుకుంటూ ప‌క్క పార్టీ వారికి ఆవ‌కాశ‌లు ఇస్తుంటాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్ రాజ‌కీయం అలాగే న‌డుస్తుంది.

మునుగోడు ఉపఎన్నిక‌ల ప్ర‌చారం కోసం నేను రాను.. రాలేను అంటూ భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఏఐసీసీ నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవటంపై పార్టీకి వివ‌ర‌ణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తో వేదిక పంచుకోలేనంటూ తేల్చి చెప్పారు.

పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఇద్ద‌రి వ‌ల్ల పార్టీ అస్తిత్వం కోల్పోతుంద‌ని, త‌క్ష‌ణ‌మే ఠాగూర్ ను త‌ప్పించి సీనియ‌ర్ నేత‌లు అయిన క‌మ‌ల్ నాథ్ వంటి నేత‌ల‌ను నియ‌మించాల‌ని కోరారు. తాను 35 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో ప‌నిచేసిన త‌న‌కు మ‌ణిక్కం ఠాగూర్ వ‌ల్ల అన్యాయం జ‌రిగింద‌న్నారు.

పార్టీలు ఫిరాయించి వ‌చ్చిన నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డం వ‌ల్ల కాంగ్రెస్ కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు. మునుగోడు ఎన్నిక‌ల్లో పార్టీకి 30 నుండి 35 వేల ఓట్లు కూడా రావ‌డ‌మే క‌ష్టమ‌న్న ఆయ‌న మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్ల‌న‌ని చెప్పారు. రేవంత్ తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడించడంతో పాటు.. ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు అని తెల్చి చెప్పారు.