తెలంగాణ రాజకీయలల్లో పార్టీలకు, ఎమ్మెల్యేల రాజీనామాలు పరంపరలు సాగుతున్నాయి. గత వారంలో కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే ఈ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. స్వయంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను కలిసి రాజీనామా సమర్పించానున్నారు.
ఇవాళ ఉదయం గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళి ఆర్పించిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లడూతూ కుటుంబ పాలన వ్యతిరేకంగా కేసీఆర్ ను గద్దెదించేందుకు నా రాజీనామా అంటూ ప్రకటించారు.
యుద్దం నాకోసం కాదు.. మునుగోడు ప్రజల కోసమే నేను రాజీనామా చేసి మళ్లీ గెలిచి కేసీఆర్ పాలనకు ముగింపు పలకడానికి వచ్చే ఉపఎన్నిక అవసరం అంటూ.. అమరవీరుల స్థూపం సాక్షిగా రాజీనామా పత్రంపై సంతకం చేశారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత కాంగ్రెస్ పార్టీ మునుగోడులో పార్టీ పరువు నిలుపుకొవడానికి కష్టపడుతోంది. బీజేపీ కూడా ఎలాగైనా కోమటి రెడ్డిని గెలిపించుకోని కేసీఆర్ కు షాక్ ఇవ్వలాని చూస్తున్నారు. టీఆర్ఎస్ కూడా కేంద్ర పార్టీలకు తెలంగాణలో అడుగుపెట్టకుండా ఉండాలంటే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవలాని ప్రయత్నిస్తూన్నారు. మునుగోడు ఉపఎన్నిక మాత్రం తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు సెమీ పైనల్ గా చూడవచ్చు.