టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కుమారుడు, యువ హీరో నాగచైతన్యకు హీరోయిన్ సమంతతో విడాకులు కావడానికి ప్రధాన కారకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.
బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. చాలా మంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీ నుంచి త్వరగా తప్పుకోడానికి కేటీఆర్ కారణమని ఆమె ఆరోపణలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. అలాగే హీరోయిన్లకు, సినీ పరిశ్రమ వ్యక్తులకు మత్తు పదార్థాలను అలవాటు చేసిందే కేటీఆర్ అని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ అహంకారంతో మదమెక్కి ఎంతో మంది చిత్రపరిశ్రమ వారికి మత్తు పదార్థాలు అలవాటు చేశారని ఘాటు విమర్శలు చేశారు.
తనపై ట్రోలింగ్ జరిగితే కేటీఆర్ ఎందుకు స్పందించలేదని కేటీఆర్‌ను సురేఖ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ చేసిందెవరు? బీఆర్ఎస్ నేతలే కదా? అని ఆమె ప్రశ్నించారు. రేవ్ పార్టీలు నిర్వహించింది బీఆర్ఎస్ నేతలే అన్నారు. అనంతరం చిత్రపరిశ్రమకు చెందిన వారిని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై ట్రోలింగ్ జరిగితే, కనీసం మనసున్న మనిషిగా హరీష్‌రావు స్పందించారని సురేఖ తెలిపారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డగా కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు.
You are in ruling party to take action. KTR మీద పడి ఏడవటం ఏమిటో? #Just asking
Call boy jobs available 9989793850
vc estanu 9380537747
Check with KTR…😜
Why can’t moderator remove this type of advertisements?
These are serious allegations man. Every one knew, not sure why there is no #metoo against ktr?
Somebody who is in a responsible polistion like a minister can not/will not take names directly without sufficient evidence. If the involved parties are innocent then they should file defamation case against the minister. Otherwise, they are accepting the allegations.