చిన్నారులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచరమ్మ సభ్య సమాజం తల దించుకునే పని చేసింది. ఎవరూ ఊహించని రీతిలో తను పాఠాలు బోధించే విద్యార్థితో జంప్ అయ్యింది. ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థితో కలిసి అదృశ్యమైన సంఘటన చందానగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన ఒంట్లో బాగులేదని చెప్పి స్కూల్ నుంచి వెళ్ళిన టీచర్ ఇంటికి వెళ్ళకుండా అదే స్కూల్‌లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థితో కలిసి వెళ్లిపోయింది. తమ కుమారుడు కనిపించడం లేదంటూ విద్యార్థి తల్లిదండ్రులు, తమ కూతురు కనిపించడం లేదంటూ అటు టీచర్ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
10 రోజుల తర్వాత విద్యార్థి, టీచర్లు ఎవరి ఇంటి వారు చేరుకోవడంతో వారి తల్లిదండ్రులు కేసు వెనక్కి తీసుకున్నారు. ఇన్ని రోజులు ఎక్కడికెళ్లావంటు బాలుడిని ప్రశ్నించడంతో ఇరువురు మధ్య ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరిని పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.