కూలిన ప్లైఓవ‌ర్ ర్యాంప్.. పలువురికి తీవ్ర గాయాలు!

హైదరాబాద్ లోని సాగర్ రింగ్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. నేడు తెల్లవారుజామున ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మిస్తున్న బైరామల్ గూడ ఫ్లైఓవర్ ర్యాంప్ కుప్పకూలింది.  Advertisement ఈ ఘటనలో 15 మంది కార్మికులకు…

హైదరాబాద్ లోని సాగర్ రింగ్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. నేడు తెల్లవారుజామున ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మిస్తున్న బైరామల్ గూడ ఫ్లైఓవర్ ర్యాంప్ కుప్పకూలింది. 

ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలవ్వగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పినట్లైందని అధికారులు చెబుతున్నారు. 

కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డవారు యూపీ, బీహార్ కు చెందిన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాంక్రీట్ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలాన్ని ప‌రిశీలించిన‌ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు చేపిస్తామని, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షపడేలా చేస్తామన్నారు. కాగా ఘటనా స్థాలానికి ఇంజినీర్ల బృందం చేరుకోనుంది. ఫ్లై ఓవర్ కూలిపోవడానికి గల కారణాలను ఏంటనే దానిపై ఇంజినీర్ల బృందం పరిశీలన చేపట్టనుంది.