మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఊరంతా చూస్తుండగానే మహేశ్ అనే యువకుడిని నడిరోడ్డుపై బండరాయితో కొట్టి చంపేశారు. పెళ్లైన మహిళను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ఆమె తల్లి, సోదరి, మరొకరు ఈ దారుణానికి పాల్పడారు. పలుమార్లు ఆ యువకుడి తలపై కొట్టి చిధ్రం చేసిన యువతి కుటుంబసభ్యులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లయిన యువతికి మృతుడు మహేశ్ గత కొన్ని రోజుల క్రితం అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టి వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మహేశ్ వేధింపులు ఆగకపోవడంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగబడినట్లు చెబుతున్నారు. మహేశ్ బండిపై వెళుతున్న సమయంలో అపి ఆ కుటుంబం యువకుడిని బండరాయితో చితకబాదింది. అందరూ చూస్తుండగా మహేశ్ చనిపోయే వరకు పలు మార్లు తలపై బాది, అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
నన్ను కాపాడంటూ అంటూ మహేశ్ ఆర్తనాదాలు పెట్టినా ఊరి జనం చూస్తుండిపోయారు తప్పా ఎవరు అపాడానికి ప్రయత్నం చేయలేకపోగా.. ఆ ఘటను తమ ఫోన్లో వీడియోలు తీశారు. తన కొడుకును అన్యాయంగా చంపేసిన వారిని అప్పగిస్తే తగిగ శిక్ష విధిస్తామని బాధిత తల్లి వాపోయింది.