దేశంలో ముస్లింల జనాభా పెరగడం లేదని, కండోమ్లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలేనన్నారు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. జనాభా నియంత్రణపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలపై సంచాలన వ్యాఖ్యలు చేశారు.
నాగాపూర్ లోని ఒక సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారతదేశానికి జనాభా నియంత్రణకు “అందరికీ సమానంగా వర్తించే” విధానం అవసరమని, దేశంలో మతపరమైన అసమానతలు భారీగా పెరిగిపోయాయని, జనాభా అడ్డు అదుపు లేకుండా పెరగడం వల్ల మతపరమైన సమతౌల్యం దెబ్బతిన్నదని, దీన్ని నియంత్రణపై దృష్టి సారించాలంటూ ప్రభుత్వానికి సూచన చేశారు.
మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ మాట్లాడుతూ ముస్లిం జనాభా పెరగడం లేదని తప్పుడు లెక్కలు చెప్పుతున్నరంటూ మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు చాల ఇబ్బందులు పడుతున్నరని, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోయినట్టు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్లల్లో నివసించే ప్రతి ముస్లిం కూడా ఓపెన్ జైలులో ఉన్నట్లుగా భావిస్తోన్నారని చెప్పారు.
నవరాత్రి గర్బా వేదికపై రాళ్లదాడికి పాల్పడినందుకు కొంతమంది ముస్లింలను గుజరాత్ పోలీసులు ప్రజల మధ్యలోకి తీసుకువచ్చి కొరడాలతో కొట్టరని, ఇది భారత ప్రజాస్వామ్యమా? ఇది భారతీయ లౌకికవాదమా? ఇది చట్టబద్ధమైనదా చర్యనా అంటూ.. రోడ్డుపక్కన ఉన్న కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా ముస్లింలకు ఇవ్వడం లేదన్నారు ఒవైసీ.