డీఏవీ స్కూల్ డ్రైవర్ కి 20 ఏళ్ల జైలు శిక్ష!

గతేడాది హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడుగా ఉన్న‌ ర‌జనీ కుమార్ కు నాంప‌ల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.  Advertisement…

గతేడాది హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడుగా ఉన్న‌ ర‌జనీ కుమార్ కు నాంప‌ల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. 

డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవ‌ర్ ర‌జనీ కుమార్.. అదే స్కూల్ లో చ‌దువుతున్న విద్యార్థినిపై గ‌తేడాది అక్టోబ‌రు 17న అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. అక్టోబర్ 19న రజినీ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెల‌ల్లోనే విచారించిన కోర్టు ర‌జ‌నీ కుమార్ ను దోషిగా నిర్ణ‌యిస్తూ శిక్ష ఖరారు చేసింది.

గ‌త ఏడాది ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఘ‌ట‌న‌ను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ కొన్ని రోజుల త‌ర్వాత విద్యార్ధుల చ‌దువును దృష్టిలో పెట్టుకొని డీఏవీ స్కూల్ రీ-ఓపెన్ చేయ‌డానికి పర్మిషన్ ఇచ్చారు.