నిజం నిప్పులాంటిది కాస్త లేటు అయినా నిజం బయటపడుతుంది అంటుంటారు అదే నిజం అయ్యింది రేవంత్ రెడ్డి విషయంలో. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చంద్రబాబునే పంపించారని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదలు కొని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తునే ఉన్నారు. అదే విషయాన్ని ఒప్పుకున్నారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
నిన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనను చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపించారంటూనే.. పంపిస్తే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్ధానం ప్రారంభించారని, కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పని చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నుండి చంద్రబాబు టీడీపీలోకి వెళ్లారు కాబట్టి.. తనను చంద్రబాబు.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి పంపించారేమో అంటూ కామెంట్ చేశారు.
టీడీపీ కార్యకర్తలు ఇప్పటికి అయినా చంద్రబాబు కాంగ్రెస్ నుండి వచ్చిన వ్యక్తి అని.. టీడీపీ పార్టీని స్ధాపించిన ఎన్టీఆర్ ను వెన్నుపొటు పోడిచి టీడీపీ పార్టీని లాక్కున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇతర పార్టీ నేతలు అంటూన్నారు. రేవంత్ పిసిసి అధ్యక్ష పదవి కూడా చంద్రబాబు లాబియింగ్ వల్ల వచ్చిందంనే విషయంపై కూడా క్లారిటి ఇస్తే బాగుండేదంటూన్నారు కాంగ్రెస్ లోని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గ నేతలు.
పుకార్లు ఎవరిపైనా ఊరికే రావంటుంటారు రేవంత్ రెడ్డి విషయంలో అవి నిజం అయ్యాయి. టీడీపీ రాజ్యసభ సభ్యులపై కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. వారు కూడా తర్వాత అయినా నిజం ఒప్పుకుంటారు అంటూన్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు రాజకీయ జీవితం అంత కూడా వ్యవస్థలలోను, ఇతర పార్టీలోను తన అనుకూల వర్గం వారిని పెట్టుకొని రాజకీయ ప్రస్ధానం సాగిస్తున్నారనేది రేవంత్ రెడ్డి మాటలు బట్టి ఆర్ధం చేసుకొవచ్చు.