బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్‌నే ఫాలో అవుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఎంపీ ఎన్నిక‌ల ముందు కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న ఆయ‌న తాజాగా సీనియ‌ర్ బీఆర్ఎస్…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్‌నే ఫాలో అవుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఎంపీ ఎన్నిక‌ల ముందు కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న ఆయ‌న తాజాగా సీనియ‌ర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌లో చేరాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు మంత్రి పోంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పోచారం ఇంటికి వెళ్లారు.

నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పోచారం రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగినా సొంత చరిష్మాతో బాన్సువాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. పోచారం కాంగ్రెస్‌లోకి చేరితే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో పోచారంతో రేవంత్ భేటీ ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. 

కాగా పోచారంతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యార‌న్న స‌మాచారంతో బీఆర్ఎస్ నేత‌లు పోచారం ఇంటి ద‌గ్గ‌ర హంగామా సృష్టించారు. మ‌రోవైపు ప్రాణం ఉన్నంత వ‌ర‌కు మీరే మా నాయ‌కుడు సార్ అంటూ గ‌తంలో పోచారం మాట్లాడిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పోచారం కాంగ్రెస్‌లోకి వెళ్లితే ఆయ‌న‌తో పాటు మ‌రి కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.