తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి జాతీయ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లడూతూ జాతీయ రాజకీయాల్లోకి పోదామా అంటూ ప్రజలను కేసీఆర్ అడిగారు.
తనను కలవడానికి, తెలంగాణలో జరుగుతున్న అభివృధిని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూడాటానికి దేశంలోని 26 రాష్ట్రాల నుండి రైతు సంఘం నేతలు వచ్చారన్నారు. వారందరూ తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని అహ్వానించినట్లు కేసీఆర్ ప్రజలకు తెలిపారు. అందుకే మనం జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా అని ప్రజలను అడిగారు.
దేశ ప్రజలను బీజేపీ ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డారు. ప్రతి వాటిపైనా పన్నులు వేసుకుంటూ లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం పోయి.. రైతు ప్రభుత్వం వస్తుందన్నారు. బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ కలిసి పోరాడాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ సీఎం ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో జాతీయ రాజకీయాల ప్రస్తావనతో తర్వలోనే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరేలా కనపడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళితే మాత్రం తప్పకుండా బీజేపీకి కాస్తా కష్టంగా ఉండబోతుంది అంటూన్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఏదైనా సాధించాలనుకుంటే తప్పకుండా కష్టపడి సాధిస్తారు అనేది అందరికి తెలిసిందే.