ప్రజల్లో తక్కువ.. మీడియాలో ఎక్కువ కనపడే ఆంధ్ర బీజేపీ మరో రాజకీయ యాత్ర చేయబోతోంది. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్ట్ ల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యాత్ర చేయబోతున్నారాంటా. ఈ యాత్రకు బీజేపీ అధ్యక్షుడు, రాయలసీమ ప్రజలను, కడప ప్రజలపై అవమానకరంగా మాట్లాడిన సోము వీర్రాజు నాయకత్వం వహించనున్నారు.
బీజేపీకి ఇప్పుడు రాయలసీమ మీద ప్రేమ ఎందుకు వచ్చిందో తెలియదు. ముందుగా 2018 కర్నూలో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ కట్టుబడి విభజన చట్టంలో ఉన్నటువంటి హామిలను నేరవేర్చితే బీజేపీని గుర్తిస్తారు. డిక్లరేషన్ ఉన్న కర్నూల్ లో హైకోర్టు, కడప స్టీల్ ప్లాంట్, గుంతకల్ రైల్వే జోన్, రాయలసీమకు ప్రత్యేక ఫ్యాకేజీ ఏర్పాటు చేసీ బీజేపీ తన చిత్తశుద్ధిని తెలియజేయాలంటూన్నారు రాయలసీమ మేధావులు, ప్రజలు.
రాయలసీమ డిక్లరేషన్ పట్టించుకోకుండా అమరావతిలోనే అన్ని ఉండాలి అనుకునే బీజేపీ నేతలు ఎన్ని సభలు, సమావేశాలు, యాత్రలు పెట్టిన రాయలసీమ ప్రజలు కనీసం బీజేపీ పార్టీ ఉందని కూడా గుర్తుంచారు అనే విషయాన్ని తెలుసుకోవాలి.
ఒకవైపు చంద్రబాబు ఆజెండాతో పని చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు, పోలవరం బకాయిలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వని ఇబ్బందులు గురిచేస్తునే ఉన్నారు అందుకే రాష్ట్రంలో బీజేపీని ప్రజలు పక్కకు పెట్టారు. ఇప్పటికైనా విభజన హామిలను నెరవేరిస్తే ప్రజలు పార్టీని గుర్తిస్తారు. బీజేపీ నేతలు రాయలసీమ డిక్లరేషన్ లో ఉన్న ఒక హామి అయిన నేరవెర్చి రాయలసీమలో యాత్ర చేస్తే మంచిది.