గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న వార్తలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్టర్ వేదికపై క్లారిటీ ఇచ్చారు.
'వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని, పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే'. అంటూ ట్వీట్ చేశారు.
కాగా గత కొన్ని రోజులుగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అనారోగ్యానికి గురి అయినప్పుడు షర్మిల ఫోన్ చేయడం, ఎప్పుడు లేని విధంగా రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం చూసి పుకార్లు నిజం అనుకున్నారు. కాంగ్రెస్‌లో పార్టీ విలీనం చేసి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే కూడా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం టచ్‌లోనే ఉందని.. ఆమె వల్ల ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతున్నారు. తాజా షర్మిల ట్వీట్‌లో తన రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి అంటుందే తప్పా పార్టీ విలీనంపై కానీ, కాంగ్రెస్ పార్టీపై గురించి కానీ క్లారిటీ ఇవ్వలేదు.