ష‌ర్మిల బెయిల్‌పై ఉత్కంఠ‌…ఏమైందంటే!

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అక్క వైఎస్ ష‌ర్మిల బెయిల్ ఉత్కంఠ‌కు తెర‌దించారు. ఎట్ట‌కేల‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను నాంప‌ల్లి కోర్టు మంజూరు చేసింది. దీంతో వైఎస్సార్‌టీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. త‌న ఇంటి…

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అక్క వైఎస్ ష‌ర్మిల బెయిల్ ఉత్కంఠ‌కు తెర‌దించారు. ఎట్ట‌కేల‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను నాంప‌ల్లి కోర్టు మంజూరు చేసింది. దీంతో వైఎస్సార్‌టీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. త‌న ఇంటి ద‌గ్గ‌ర పోలీసుల‌పై ష‌ర్మిల చేయి చేసుకున్నార‌నే అభియోగాల‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అరెస్ట్ అనంత‌రం ఆమెని చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు.

ష‌ర్మిల బెయిల్ పిటిష‌న్‌పై ఇవాళ నాంప‌ల్లి కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ష‌ర్మిల త‌ర‌పు, అలాగే పోలీసుల వైపు నుంచి గ‌ట్టి వాద‌న‌లు చోటు చేసుకున్నాయి. ఇరువైపు వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం తీర్పును మ‌ధ్యాహ్నానికి వాయిదా వేసింది. కాసేప‌టికే ష‌ర్మిల‌కు అనుకూల‌మైన తీర్పు వెలువ‌డింది. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల‌కు న్యాయ‌స్థానం ష‌ర‌తులు విధించింది. రూ.30 వేల పూచీక‌త్తు చెల్లించాలని, అలాగే రెండు ష్యూరిటీలు స‌మ‌ర్పించాల‌ని న్యాయ‌స్థానం పేర్కొంది.

పోలీసుల విచార‌ణ‌కు ష‌ర్మిల‌ స‌హ‌క‌రించాల‌ని, కోర్టు అనుమ‌తి లేకుండా దేశం విడిచి వెళ్ల‌కూడ‌దంటూ నాంప‌ల్లి కోర్టు ష‌ర‌తులు విధించింది. దీంతో బెయిల్ విష‌య‌మై ష‌ర్మిల‌కు ఊర‌ట దొరికింది. రెండు వేర్వేరు కేసుల విష‌య‌మై వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్ద‌రు నేత‌లు న్యాయ‌స్థానంలో బెయిల్ కోసం పోరాటం చేయ‌డం గ‌మనార్హం. 

అవినాష్‌కు అక్కైన ష‌ర్మిల‌కు సానుకూల తీర్పు రాగా, అవినాష్‌కు సంబంధించి ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఇవాళ మ‌ధ్యాహ్నంపైబ‌డి అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్‌పై హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.