వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్!

పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయ‌స్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.  మే 8 వరకు రిమాండ్ విధించింది. షర్మిలను పోలీసులు చంచల్ గూడ జైలుకు…

పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయ‌స్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.  మే 8 వరకు రిమాండ్ విధించింది. షర్మిలను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. 

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్య‌వ‌హారంలో సిట్ అధికారుల‌కు విన‌తిప‌త్రం ఇచ్చేందుకు వెళ్తున్న ష‌ర్మిల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో ఆ స‌మ‌యంలో పోలీసుల‌పై ష‌ర్మిల చేయి చేసుకున్నారు. దీంతో ష‌ర్మిలపై 332, 353, 509, 427 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

పేపర్ లీకేజీ కేసుపై సిట్ చీఫ్ ను కలవడానికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు ఆమె తరపు న్యాయవాది. 41సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని.. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్స్ అన్ని ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులని చెప్పారు. అందుకే రిమాండ్ రిజెక్ట్ చేయాలని బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నామని ఆమె త‌రుపు న్యాయ‌వాది తెలిపారు.