సుఖేష్ తో కవిత చాటింగ్ నిజమే- అనంత్ మాలిక్

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సుఖేష్‌ చంద్రశేఖర్ లీక్ చేసిన వాట్సాప్ చాట్స్, లెటర్ తో తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత స్పందించడం చిన్నపిల్లల ప్రకటనలా ఉందని సుఖేష్‌…

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సుఖేష్‌ చంద్రశేఖర్ లీక్ చేసిన వాట్సాప్ చాట్స్, లెటర్ తో తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత స్పందించడం చిన్నపిల్లల ప్రకటనలా ఉందని సుఖేష్‌ చంద్రశేఖర్ లాయర్ అనంత్ మాలిక్ ఎద్దేవా చేశారు. క‌వితకు స‌మాధానంగా సుఖేష్‌ లాయ‌ర్ త‌న క్ల‌యింట్ లేవ‌నెత్తిన‌వ్నీ నిజాలంటూ మీడియాకు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

సుఖేష్‌ తన ఆరోపణలను అఫిడవిట్‌ రూపంలో ఇచ్చార‌ని.. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 65బీ కింద ధ్రువపత్రం కూడా జ‌త చేశార‌ని.. సుఖేష్‌ తన వాదనలకు మద్దతుగా అనేక డిజిటల్ సాక్ష్యాలను అందజేశారని.. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించే బదులు కవిత దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అనంత్ మాలిక్ ఆరోపించారు. కవిత స్పందన చూస్తుంటే దాగుడుమూతలు ఆడడంలో నైపుణ్యం ఉన్న వ్య‌క్తిగా క‌న‌ప‌డుతున్న‌ట్లు ఎద్దేవా చేశారు.

రెండు రోజుల క్రితం సుఖేష్‌ చంద్ర‌శేఖ‌ర్ త‌రపు న్యాయ‌వాది క‌విత‌-సుఖేష్‌ మ‌ధ్య జ‌రిగిన వాట్సాప్ చాట్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు విడుద‌ల చేశారు. దానికి కౌంట‌ర్ గా క‌విత వివ‌ర‌ణ ఇస్తూ.. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో పరిచయం కూడా లేద‌ని.  గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా త‌న‌ మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నార‌ని.. క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నార‌ని మండిపడ్డారు.

తాజా సుఖేష్ లాయ‌ర్ ప్ర‌క‌ట‌న‌తో ఎమ్మెల్సీ క‌విత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్ప‌టికే ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూన్నా క‌విత ఇప్ప‌టికే ఈడీ విచార‌ణ కూడా ఎదుర్కొంది. లిక్క‌ర్ స్కాం విచార‌ణ జ‌రుగుతుండ‌గా మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ ఇప్ప‌టికే ఢిల్లీ అధికార పార్టీ అప్ కు వ్య‌తిరేకంగా ప‌లు లెట‌ర్లు విడుద‌ల చేశారు.